ఆంధ్రప్రదేశ్‌

తెలుగుకు బదులు సంస్కృతం పేపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. టెన్త్ పరీక్షలకు ఆంధ్రాలో 6,57,595 మంది, తెలంగాణలో 5,56,757 మంది హాజరవుతున్నారు. తొలి రోజు యథాప్రకారం చాలా కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక చీకటి గదుల్లో, గాలి లేని గదుల్లో విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని కేంద్రాల్లో తెలుగు పరీక్షకు బదులు సంస్కృతం పేపర్‌ను ఇవ్వడంతో విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు.
కాస్సేపు అయిన తర్వాత పేపర్ మారిందని తెలియడంతో అధికారులు నాలిక్కరుచుకున్నారు. దర్శి కేంద్రంలోనూ పేపర్లు తారుమారయ్యాయి. మాల్ ప్రాక్టీస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారులు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. చాలా పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కూడా కరవయ్యింది.
మండు వేసవిలో తనిఖీల పేరిట విద్యార్ధులను ప్రధాన గేట్ల వద్ద నిలిపివేయడంతో పలు చోట్ల విద్యార్ధులు నిరసన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లను స్టోర్ చేసే కేంద్రాలు లేకపోవడంతో కూడా బాలికలు ఇబ్బందులు పడ్డారు. వేరే కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న విద్యార్ధులు చాలా వరకూ సెల్‌ఫోన్లు తీసుకురావడంతో వాటిని భద్రపరిచేందుకు పలు చోట్ల అధికారులు నిరాకరించడంతో అసౌకర్యానికి గురయ్యారు. వివాదాస్పద, సున్నిత కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని కేంద్రాల్లో జిపిఎస్ ద్వారా టెలి నెట్‌వర్కును సైతం ట్రాకింగ్ ఏర్పాటు చేశారు.

తూ.గో.లో లీకైన టెన్త్ తెలుగు-1 ప్రశ్నపత్రం
కూనవరం, మార్చి 21: తూర్పు గోదావరి జిల్లా కూనవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల పశ్నాపత్రం లీకయ్యింది. పరీక్ష ప్రారంభమైన గంటలోనే ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వచ్చేసింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన తెలుగు-1 పేపరు 10.23 గంటలకే వాట్సాప్ ద్వారా కొందరు బయట వ్యక్తులకు వచ్చింది. దాంతో వారు సమీపంలోని ఒక ఇంట్లో చేరి సమాధానాలు సిద్ధం చేస్తుండగా అక్కడకు వెళ్లిన విలేఖర్లను చూసి పరారయ్యారు. పరారైన వ్యక్తులు ఒక ఫోను అక్కడ వదిలి వెళ్లిపోయారు. ఆ ఫోనును పరిశీలించగా ప్రశ్నాపత్రం బయటపడింది. ఈ విషయం దావానలంలా రాష్టవ్య్రాప్తంగా పాకింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణకుమార్ ఆదేశాల మేరకు ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఏజన్సీ డిఇఒ డివిఎస్‌జి కుమార్ విచారణ ప్రారంభించారు. ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని చీఫ్ సూపరింటెండెంటు బాలరాజు, డిఒ బాబూరావు, సిబ్బందిని విచారించారు. ప్రశ్నాపత్రం లీకైన విషయం పోలీసులకు తెలిసినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభింలేరా అని మండిపడ్డారు.