ఆంధ్రప్రదేశ్‌

నేడు ఏపి విసిలు, రిజిస్ట్రార్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలు , వాటి పరిష్కార మార్గాలు, ప్రవేశపరీక్షల నిర్వహణ, అడ్మిషన్లు, బోధన సిబ్బంది నియామకం, ర్యాగింగ్ నిరోధం వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ సమావేశంలో యూనివర్శిటీల వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి చర్చించనున్నట్టు తెలిసింది. యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1100 పస్టుల భర్తీకి ఇటీవల క్యాబినెట్ ఆమోదం లభించిన నేపథ్యంలో వాటి భర్తీపైనా చర్చిస్తారు. వీటిని సెంట్రలైజ్డ్ విధానంలో భర్తీ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కేంద్రీకృతంగా ఒకే రిక్రూట్‌మెంట్ ద్వారా అన్ని పోస్టులనూ భర్తీ చేసేందుకు ఉన్న అవకాశాలు, విధి విధానాలను చర్చిస్తారు.