ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే టీడీపీకి జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, ఫిబ్రవరి 5: దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంటే తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్దమని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి వెళ్లాలని పార్టీ అధిష్టానానికి సూచించినా తన మాట ఖాతరు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేగాక తాను పార్టీ వీ డుతున్నట్లు వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనతో మాట్లాడటం లేదని అసహనం వ్య క్తం చేశారు. అందుకే పార్టీలో చేరే ప్రస్తావనను పక్కనపెట్టి ఈ ప్రాంతంలోని రైతుల సంక్షేమం కో సం ఇక్కడ పెండింగులో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణా ల విషయంపై ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడును కలిశానన్నారు. తన డిమాండ్లను ఆయన ముందుంచినట్లు కోట్ల తెలిపారు. ఈ డిమాండ్లను ఆమోదిస్తే తాను టీడీపీతో జతకట్టేందుకు సిద్దమని చెప్పానన్నారు. రాజకీయ జీవితంలో రోషాలు, మీ సాలు మెలేయడం తగదన్నారు. ప్రాంతాల అభివృ ద్ధి, రైతులు, ప్రజాసంక్షేమమే ముఖ్యం కాబట్టి ఆ దిశగా నేతలు, నాయకులు అడుగులు వేయాలని కోట్ల సూచించారు. అలాంటి నేతలనే ప్రజలు హర్షిస్తారన్నారు. వ్యక్తిగత లబ్ది, స్వార్థ రాజకీయాలు, ప దవుల కోసం పాకులాడే వారు రాజకీయాల్లో ఎక్కు వ రోజులు నిలబడలేరన్నారు. కోట్ల కుటుంబం సి ద్దాంతాలు కలిగిన కుటుంబం, కాబట్టే ప్రజలు తమ వెంట ఉన్నారని, పదవుల కోసం కోట్ల కుటుంబం ఏనాడు పాకులాడలేదని, పదవులే కోట్ల కుటుంబా న్ని వరించాయని సూర్య గుర్తు చేశారు. కోట్ల కు టుంబంపై దశాబ్దాల తరబడి ఎనలేని ప్రేమాభిమానాలు చూపే ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నందున ప్రజల భవిష్యత్ కోసం ప్రజలకు దూరమైన కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, కోట్ల అభిమానులు కె. మధుసూదన్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, సీబీ లత, రఫీక్, గుంతకంటి వేణుగోపాల్‌రెడ్డి, లింగమూర్తి, లింగమయ్య, మాదులు, లింగన్న, రాఘవేంద్ర, వీరేష్, సాయరాజేంద్ర, గోట్ల తిమ్మప్ప, గిడ్డాయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.