ఆంధ్రప్రదేశ్‌

టీజీటీ ఫైనల్ కీలో తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 5: ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ట్రైన్‌డ్ గ్రేడ్ టీచర్ (టీజీటీ)కు నిర్వహించిన పరీక్షకు సంబంధించి విద్యాశాఖ విడుదల చేసిన ఫైనల్‌కీ లో తప్పు దొర్లడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం రాత్రి విడుదలైన టీజీటీ ఫైనల్‌కీ 86వ ప్రశ్నకు ఆప్షన్-2 సరైన సమాధానం కాగా ఆప్షన్-1ను సరైందిగా పేర్కొంటూ ఆ మేరకు కీ విడుదల చేయడం అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. పరీక్ష అనంతరం విడుదల చేసిన తొలి కీ లో 86వ ప్రశ్నకు సరైన సమాధానంగా ఆప్షన్-2ను విద్యాశాఖ పేర్కొన్నప్పటికీ ఫైనల్‌కీ లో ఆప్షన్-1గా విడుదల చేయడం అయోమయానికి గురిచేసింది.
నోటిఫికేషన్ విడుదల సమయంలో ఏవైనా తప్పొప్పులకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అకాడమి పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది. ఆ మేరకు 86వ ప్రశ్నకు సంబంధించి అకాడమి బుక్‌లో 176వ పేజీలో బిట్ నెంబర్ 13, బిట్ నెంబర్ 23, 177వ పేజీలో బిట్ నెంబర్ 14ను ఉదాహరణలుగా పొందుపర్చారు. ఈ ప్రకారం చూసుకుంటే టిజిటి పరీక్షలో ఇచ్చిన 86వ ప్రశ్నకు ఆప్షన్-2లో ఇచ్చిన ‘వాంట్స్’ సరైన సమాధానమని అభ్యర్థులు ఉదాహరణలతో సహా చూపుతున్నారు. విద్యాశాఖ విడుదల చేసిన ఫైనల్‌కీ లో తప్పును సరైన సమాధానంగా పేర్కొనడంతో అరమార్కు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఎస్‌సికి సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ర్యాంకులు కేటాయిస్తున్నప్పటికీ, టిజిటికి సంబంధించి రాష్ట్రం మొత్తమీద ర్యాంకులు విడుదలయ్యే క్రమంలో ఈ అరమార్కు ఎంతో ముఖ్యమైందని పేర్కొంటున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫైనల్‌కీ లో దొర్లిన తప్పును సరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.