ఆంధ్రప్రదేశ్‌

వాట్ ఈజ్ దిస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: కొంతమంది ఎమ్మెల్సీలు సభలో వ్యవహరిస్తున్న తీరుపై శాసన మండలి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలు పాటించకపోవడంతో వాట్ ఈజ్ దిస్? అంటూ అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఒక ప్రశ్నకు బదులిస్తుండగా, బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు అడ్డుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు.
వీర్రాజు మాట్లాడుతుంటే మంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే బాధతో మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. ఈ దశలో ఎమ్మెల్సీ దొరబాబు లేచి వీర్రాజు వ్యాఖ్యలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతుండటంతో చైర్మన్ జోక్యం చేసుకుని ఇలా సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే చైర్ ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా, సాంప్రదాయాలు పాటించరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరద్దరూ డైరెక్టుగా మాట్లాడుకుంటే చైర్ ఎందుకని, తాను వినాలా అని ప్రశ్నించారు. ఈ దశలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ సస్పెండ్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇది క్వచ్చన్ అవర్ అని, క్వచ్చన్ అవర్స్ చేయకండని చైర్మన్ సూచించారు. ప్రశ్నోత్తరాలను లఘు చర్చగా చేస్తే ఏలా అని ప్రశ్నించారు. మరో సందర్భంలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, చైర్మన్ తీవ్రంగా స్పందించారు. సభ్యులతో విప్‌లు మాట్లాడించాలని, విప్‌లే మాట్లాడతామంటే ఎలా అంటూ చురక వేశారు. తరువాత కొద్ది సేపు మాట్లాడే అవకాశం ఆయనకు ఇచ్చారు.