ఆంధ్రప్రదేశ్‌

దళిత క్రైస్తవులకు ఎస్సీలతో సమాన హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మత మార్పిడికి చెందిన షెడ్యూల్ కులాల క్రిస్టియన్లకు షెడ్యూల్ తెగలతో సమాన హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానించింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని బుధవారం సభలో ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యే యామినీబాల బలపరిచారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. తీర్మానం పూర్తి సారాంశం ఇలా ఉంది.
సమాజంలో అంతర్భాగమైన కులవ్యవస్థ మనుషుల మధ్య అడ్డుగోడలు సృష్టించింది. తరతరాల వారసత్వంగా వస్తున్న కులవ్యవస్థ అసమానతలను పెంచి పోషించింది. హిందూ మత విశ్వాసాలను అనుసరిస్తున్న ప్రజలను సామాజిక వర్గాలుగా విడదీసింది. ఇదే వివక్షకు కారణమైంది. పుట్టుక ఆధారంగా వారి సంతతికి హోదా, గౌరవం, హక్కులు లభిస్తున్నాయి. ఉన్నత వర్గాలవారే వీటిని అనుభవిస్తున్నారు. అట్టడుగు వర్గాలవారు హక్కులకు దూరమై చివరకు వారు ఎంచుకున్న వృత్తుల్లోనూ అపరిశుభ్రంగా భావించే వృత్తులను బలవంతంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అస్పృశ్యత కుల వ్యవస్థలో అంతర్భాగమైంది. ఫలితంగా వారు అణచివేత, దోపిడీకి గురవుతూ పేదరికంలో మగ్గుతున్నారు. సామాజికాభివృద్ధిలో అర్థవంతమైన భాగస్వామ్యం వారికి లేకుండాపోయిందని శాసనసభ అభిప్రాయపడింది. కులవ్యవస్థ నుంచి ఎదరవుతున్న అవమానాలు, అణచివేతను, ఆధిపత్య భావనను తప్పించుకుని స్వేచ్ఛగా, సగౌరవంగా జీవించాలనే ఆకాంక్షతో అట్టడుగు వర్గాలవారు మత విశ్వాసాలను మార్చుకుంటున్నారు. హిందూ సమాజంలో ఇమడలేక దళిత క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాల్లోకి మార్పిడి చెందారు. అయితే కులవ్యవస్థ జాఢ్యం అక్కడ కూడా వెంటాడుతోంది. స్వీకరించిన మతాల్లోనూ వారు వేరుగా, దూరంగా సమూహంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడా వారికి సమానత్వం, సమభావం లేకపోవటంతో మతమార్పిడి ఉద్దేశం నెరవేరలేదు. స్వాతంత్రానంతరం దేశంలో కులవ్యవస్థ రగిలించిన అసమానతల తొలగింపునకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో విధివిధానాలు రూపొందించారు. ఆర్టికల్ 341 ద్వారా సంక్రమించిన అధికారంతో రాష్టప్రతి రాజ్యాంగ ఉత్తర్వు 1950, 76 సవరణల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 59 కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చారు. క్రైస్తవ మతంలో చేరిన షెడ్యూల్డ్ కులాల వారికి వీటిని నిరాకరించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేయటంతో పాటు క్రైస్తవ మతంలో చేరిన షెడ్యూల్ కులాల వారికి కూడా ఎస్సీ హోదా కల్పించేందుకు అనువుగా రాజ్యాంగ సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దళిత క్రైస్తవులు బీసీ కేటగిరీలో ఉన్నారు. ఇదిలావుండగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదరికమే కులానికి ప్రామాణికమన్నారు. ఏ వర్గంలో ఉన్నవారైనా అస్పృశ్యత, అంటరాని తనానికి గురికారాదని ఆయన స్పష్టం చేశారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు