ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ ముందుకు కాపు రిజర్వేషన్ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 6: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లలో 5శాతం కాపులకు వర్తింపచేయాలని నిర్ణయిస్తూ నిర్దేశించిన బిల్లు బుధవారం శాసనసభ ముందుకొచ్చింది. బిల్లును రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి, రవాణా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై గురు, శుక్రవారాల్లో చర్చ జరగనుంది. కొద్దిరోజుల క్రితం కాపులకు 5శాతం రిజర్వేషన్లను మంత్రివర్గం ఆమోదించింది. అయితే దీనికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. కాపులను బీసీలలో చేర్చేందుకు ప్రభుత్వం 2015లో మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ రాష్టవ్య్రాప్తంగా కాపుల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీలకు ఎలాంటి అన్యాయం జరక్కుండా కాపులకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని గతంలో శాసనసభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం చట్ట సవరణ ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించాల్సి ఉంది.
గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికార తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మంజునాథ కమిషన్ వేసిన సందర్భంలో కాపులు, బీసీల మధ్య వివాదాలు చెలరేగాయి. రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంటూ రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో కేంద్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్న బలహీన వర్గాలకు (ఈడబ్ల్యుఎస్) 10శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఇందులో 5శాతం కాపులకు, ఆర్థికంగా బలహీన వర్గాల్లోని ఇతరులకు మరో 5శాతం వర్తింపచేయాలని భావించింది. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై గురు, శుక్రవారాల్లో సభ్యులు చర్చించిన అనంతరం ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రకారం ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల కోర్సులతో పాటు ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు, పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. ఇందులో మూడింట ఒక వంతు మహిళలకు ప్రతిపాదించారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక అననుకూలత సూచీల ఆధారంగా ఆర్థికపరంగా బలహీన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిబంధనలు అమలుచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నందున వీటిల్లో 5శాతం కాపులకు కేటాయించింది. కాపులు కాని సామాజిక, వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ పథకం పరిధిలోకి రాకుండా ఆర్థికంగా బలహీనులైన వర్గాలు (ఈడబ్ల్యుఎస్)గా అగ్రకుల పేదలను పరిగణించారు. దీర్ఘకాలికంగా వీరి డిమాండ్లు, ప్రభుత్వ సర్వీస్‌లలో తగిన ప్రాతినిధ్యం లేని విషయాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం ఆర్థికంగా బలహీన వర్గాల పౌరులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీ విద్యాసంస్థలు కాని, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు సివిల్, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లలో ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు.