ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇస్తామన్న రాహుల్‌తో జగన్ కలవాలి: ద్రోణంరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: అధికారంలోకి వచ్చాకా ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో వైసీపీ అధినేత జగన్ కలిసి రావాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ సూచించారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ నిర్ధ్వందంగా ప్రకటించిన ప్రధాని మోదీని ఎందుకు నమ్ముతున్నారని ప్రశ్నించారు. హోదా ఇచ్చే పార్టీకే తాము మద్దతు పలుకుతామని జగన్ ఇది వరకే ప్రకటించారని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ వైరుధ్యాన్ని సైతం పక్కనపెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు రాహుల్ హామీని విశ్వసించి కాంగ్రెస్‌తో జతకట్టారని గుర్తు చేశారు. అటువంటిది పూర్తిగా కాంగ్రెస్ భావజాలం కలిగిన జగన్, అతని పార్టీ నాయకులు రాహుల్‌ను బలపరుస్తూ ముందుకు రాకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. హోదా ఇచ్చే రాహుల్‌ను బలపరచకపోతే హోదా హామీ పేరిట మోసం చేసిన మోదీని బలపరచినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం హోదా ఇచ్చే పార్టీని బలపరుస్తామన్న జగన్ ప్రకటనలను ఆయన కొట్టిపాడేశారు.