ఆంధ్రప్రదేశ్‌

నెరవేరిన తాడి ప్రజల కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, ఫిబ్రవరి 6: నిత్యం కాలుష్యంతో సహజీవనం చేస్తూ అష్టకష్టాలు అనుభవిస్తున్న తాడి ప్రజానీకానికి మంచి రోజులు వచ్చాయి. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీతో వెల్లువెత్తుతున్న కాలుష్యం నుంచి తాడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సారధ్యంలో చేపట్టిన ఆందోళనలు ఫలించాయి. మాజీ ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి 2012 జూన్ నెలలో ఫార్మాసిటీ వద్ద తాడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఏడు రోజు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. తాడి తరలింపునకు అవసరమైన రూ.57.63 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ బుధవారం జీవోఎంఎస్ నెంబర్ 29/2019ను విడుదల చేసింది. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ పేరుతో ఈ జీవో విడుదలైంది. ప్రతిపక్ష నేతగా పోరాటం చేసినప్పటికీ ఫలితం లేక పోవడం, అనంతరం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు విజయం సాధించడం, తిరిగి తాడిని తరలించే బాధ్యత బండారుపై పడింది. బండారు పట్టబట్టి మరీ తాడి తరలింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించారు. తాడి ప్రజల సుదీర్ఘ పోరాటానికి మంచి రోజులు వచ్చాయని, ప్రతి పక్ష రాజకీయ పార్టీలు తాడిపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఈ జీవో ఒక సమాధానం అని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు తయారు చేసిన ప్రణాళికల ప్రకారం తాడి గ్రామంలో కట్టడాలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు రూ.33.75 కోట్లను విడుదల చేశారు. అలాగే 742 కుటుంబాలను వారికి కేటాయించిన స్థలాలకు తరలించేందుకు 75 లక్షల రూపాయలను విడుదల చేశారు. పెదముషిడివాడ రెవెన్యూ పరిధిలో కేటాయించిన స్థలాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు 12 కోట్ల రూపాయలు కేటాయించారు. 742 కుటుంబాలకు ఎన్టీఆర్ అర్చన్ హౌసింగ్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఒక లక్షా 50వేల రూపాయల చొప్పన 11.13 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అలాగే ఇంటి యజమానికి ఐదు సెంట్లు చొప్పన, వివాహాలు చేసుకున్న కుమారులకు, అవివాహిత మహిళలకు మూడు సెంట్లు చొప్పన 56.60 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
తాడిలో సంబరాలు
కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి పంచాయతీని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కింద 57.63 కోట్ల రూపాయలను కేటాయిస్తూ బుధవారం జీవోఎంఎస్ నెంబర్ 29/2019ను విడుదల చేయడంతో బుధవారం తాడి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో టీడీపీ పెందుర్తి ఇన్‌చార్జి బండారు అప్పలనాయుడు, ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పయిల జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ప్రజలు బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. టీడీపీ నాయకులు డాక్టర్ గొర్లె శ్రీనివాసరావు, బొడ్డపల్లి అప్పారావు, అట్టా సన్యాసి అప్పారావు, బుగిడి రామగోవిందరావు, కోమటి వెంకటరమణ, కోమటి అచ్చిబాబు, కోమటి సూరబాబు, కనకారావు, గొల్లవిల్లి నాగరాజు పాల్గొన్నారు.
చిత్రం.. సంబరాల్లో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న టీడీపీ నేత అప్పలనాయుడు