ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి నుంచే దేశానికి హై ఎండ్ సర్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 9: భారతదేశంలోని సర్వర్ల మార్కెట్‌లో రానున్న నాలుగేళ్ల కాలంలో విలువ, వాల్యూమ్ పరంగా భారీగా వృద్ధి జరగనున్న నేపథ్యంలో అత్యున్నత శ్రేణి గ్రీన్‌ఫీల్డ్ సర్వర్లు, స్టోరేజీ ఉత్పత్తులను భారతదేశంలో మొత్తానికి తమ సంస్థ అందించడానికి సిద్ధమవుతోందని ఎక్సాట్రాన్ సీఈఓ సూర్యనారాయణణ్ బీ చెప్పారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతికి సమీపంలోని ఇండస్ట్రియల్‌పార్క్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2లో ఆదివారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుందన్నారు. తొలి దశలో రూ.60 కోట్లతో తమ నిర్మాణం ప్రారంభించి రానున్న ఐదేళ్లలో రూ. 360 కోట్లు వ్యయంతో ఈ ఏడాది చివరికి ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి తమ నిర్మాణాలను ప్రారంభిస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రానున్న ఐదేళ్లలో 900 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దాదాపు 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పైగా ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన సర్వర్లు, స్టోరేజీ ఉత్పత్తులను సకాలంలో అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎక్సాట్రాన్ డైరెక్టర్లు వెంకట రామకృష్ణ, టాయ్ సబాస్టియన్‌లు పాల్గొన్నారు.