ఆంధ్రప్రదేశ్‌

మేరీమాత మహోత్సవాలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) ఫిబ్రవరి 9: విజయవాడలోని గుణదల మేరీ మాత మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలగు బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్‌లోని ఆధ్యాత్మిక కళావేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గోల్డెన్, సిల్వర్ జూబిలేరియన్ గురువులు ఫాదర్ చాకోతొటకర, ఫాదర్ సెబాస్టియన్ కొట్టూర్, ఫాదర్ తులిమిల్లి అంతోని, ఫాదర్ రాజప్ప, తదితర గురువులు జ్యోతి ప్రజలన చేసి లాఛనంగా మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం బిషప్ జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికర్ జనరల్ ఫాదర్ ఎం.గ్రాబియేలు, గుణదలమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాధర్ యేలేటి విలియం జయరాజు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్, జూబిలేరియన్ గురువులతో కలసి ‘ సమష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు భక్తులకు సందేశమిస్తూ గుణదలమాత పుణ్యక్షేత్రం అద్భుతాల నిలయంగా విరాజిల్లుతోందన్నారు. క్రైస్తవులకు జపమాల గొప్ప ఆయుధమన్నారు. దేవుని రక్షణ ప్రణాళికను కొనసాగించటానికి మరియమాత ప్రభువును ఈ లోకానికి పంపినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు కేథలక్ గురువులు దివ్యసత్ప్రసాదం అందచేశారు. మహోత్సవాలుకు వివిధ రాష్ట్రాల నుండి ఆశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవాల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.