ఆంధ్రప్రదేశ్‌

ప్రధానికి ఖాళీ కుండలతో స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి మట్టి,నీరు ఇచ్చి మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం సందర్భంగా ప్రధాని హోదాలో పాల్గొన్న మోదీ చేసిందే, ఆయనకు తిరిగి ఇద్దామన్నారు. గుంటూరు పర్యటనలో ప్రధాని మోదీకి ఈ విధమైన స్వాగతం పలకడం ద్వారా రాష్ట్ర ప్రజల మనోభావాలను బలంగా తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక ఆసరా కల్పించాలని, రైల్వే జోన్ మంజూరు చేయాలని తాము పోరు చేస్తూనే ఉన్నామన్నారు. తమ ఉద్యమానికి క్రమేపీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని, అధికార టీడీపీ మాత్రం బీజేపీ పక్షాన నిలిచిందన్నారు. కేంద్రం తీరును ఆలస్యంగా గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీపై పోరుకు సిద్ధం కావడం స్వాగతించతగ్గ పరిణామంగా పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు సమితి తరపున సంఘీభావం తెలిపారు. గతంలో వైసీపీ చేపట్టిన దీక్షకు తాము సంఘీభావం తెలిపిన సంగతి గుర్తు చేశారు.
టీడీపీ చేపట్టిన దీక్షకు విపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలను ఆహ్వానించాలని తాము చంద్రబాబుకు సూచించినా స్పందించలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘటితంగా ఉద్యమిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోగలమని, అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కన్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.