ఆంధ్రప్రదేశ్‌

కోలాహలంగా గృహ ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: రాష్టవ్య్రాప్తంగా ఎన్టీఆర్ నగర్లలో గృహ ప్రవేశాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో గృహ ప్రవేశాలు శనివారం హడావిడిగా సాగాయి. పసుపూ కుంకుమ మాదిరిగానే ఈ కార్యక్రమం కూడా కోలాహలంగా సాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ భయం గుప్పెట ఈ గృహ ప్రవేశాలు ఇంకా వౌలిక సదుపాయాలు కొన్ని చోట్ల పూర్తి కాకుండానే హడావిడిగా సాగినట్టు కన్పిస్తోంది. ఈ హడావిడిలో కొన్ని చోట్ల పట్టాల పంపిణీ కూడా జరిగింది. మళ్లీ రంగంలోకి దిగే ఎమ్మెల్యేలంతా గృహాల ప్రారంభోత్సవాలను సందడిగా నిర్వహించారు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం రూ.1,412 కోట్ల వ్యయంతో నిర్మించిన 53,013 ప్లాట్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 39,169 గృహాలు, పట్టణాల్లో 13,844 ప్లాట్లకు గృహ ప్రవేశాలు జరిగాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో బీఎల్‌ఎస్ (బెనిఫిషరీ లెడ్ స్కీమ్) పధకంలో నిర్మించిన ఇళ్లకు కూడా ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ ఛైర్మన్లు గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. ఇలావుంటే, పలు చోట్ల అపార్టుమెంట్లలో వౌలిక సదుపాయాలు పూర్తి కాకపోయినప్పటికీ ప్రారంభోత్సవాలు చేశారు. చాలా చోట్ల రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం తదితర వసతులు కనిపించచలేదు. మండపేటలోని గొల్లపుంత ఎన్టీఆర్ నగర్‌లో 4,064 ప్లాట్లు నిర్మించారు. నూరు శాతం వౌలిక సదుపాయాలు పూర్తికానట్టు తెలుస్తోంది. పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురంలో 1,724 ప్లాట్లకు డిప్యూటీ సీ ఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభోత్సవం చేశారు. ఇంకా వౌలిక సదుపాయాల కల్పన పూర్తి కావాల్సి ఉంది. అవి ఎప్పటికి పూర్తవుతాయో?