ఆంధ్రప్రదేశ్‌

రిజర్వేషన్లపై కాపుల పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 9: రిజర్వేషన్ తరగతులకు వర్తించే అన్ని సౌకర్యాలు కాపు సామాజిక వర్గానికి అందే వరకూ బీసీ రిజర్వేషన్ కోసం కాపులు చేస్తున్న పోరాటం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాసి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో విలేఖర్లకు అందజేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన రాసిన లేఖలో ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల కోటా 10 శాతంలో అయిదు శాతం కాపులకు కేటాయిస్తూ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్లు బెట్టారని, గతంలో ప్రకటించిన విధంగా కాపులకు కూడా బీసీ సామాజిక వర్గం వారికి ఇస్తున్న జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ నిధులు, ఉద్యోగ నియామకాల్లో వయసుతోపాటు కటాఫ్ మార్కులు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా ఈ బిల్లులో పొందుపరిచారా లేదా అనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని లేఖలో పేర్కొన్నారు. బ్రిటీష్ కాలంలోను, దామోదం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా కాపులు పొందిన బీసీ రిజర్వేషన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో తిరిగి కల్పిస్తామని హామీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి, కాపులను బీసీ ‘ఎఫ్’ కేటగిరిలో చేరుస్తూ రిజర్వేషన్ బిల్లు పెట్టి రాష్టస్థ్రాయిలో అమలు చేయటానికి అవకాశం ఉన్నా కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఆయన ఆ లేఖలో దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన పది శాతంలో 5 శాతాన్ని చంద్రబాబు ఇచ్చారని, 2017 డిసెంబర్‌లో కాపులను బీసీ ఎఫ్‌లో పెడుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపులపై ప్రేమతో దానిని ఆమోదించి పంపితే 2017, 2019 బిల్లుల్లో ఏది అమలు చేస్తారో చెప్పాలని ఆయన కోరారు. 2019 బిల్లు కాపులకు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమా, లేక తమరు ఇచ్చారో సెలవిస్తారా అంటూ చంద్రబాబును సూటిగా ముద్రగడ తన లేఖలో నిలదీశారు. రాజ్యాంగ సవరణ చేసి 2019 బిల్లు పెట్టామని ఇది ఆంధ్రా ముఖ్యమంత్రి ఇచ్చింది కాదని బీజేపీ అంటోందని, ఈ బిల్లు ఎవరదని చెప్పుకోవాలో సెలవివ్వాలని ఆయన ఆ లేఖలో అడిగారు. రాష్ట్ర జనాభాలో కాపులు 18 శాతంపై బడి ఉన్నప్పటికీ, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో కాపులు 12 శాతం మాత్రమే ఉన్నారని, అగ్రవర్ణాల్లో 60 శాతం దాటి ఉన్నారని ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర ఉద్యోగ నోటిఫికేషన్లలో కాపులకు రిజర్వేషన్ వర్తింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగేళ్లల్లో కాపుల్లో ఎంతోమంది విద్యా, ఉద్యోగావకాశాలతోపాటు ఆర్థిక ప్రయోజనాలు చాలా నష్టపోయారన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యా బలం కల్గిన కాపులకు కల్పిస్తున్న రిజర్వేషన్లు చాలా తక్కువగా ఉన్నందున భవిష్యత్తులో కనీసం పది శాతం వరకూ రిజర్వేషన్ కల్పించే ఆలోచన ఏమైందా ఉందా అని ప్రశ్నిస్తూ రిజర్వేషన్ త్సౌకర్యాలు కాపు, బలిజ, ఒంటరి, తెలగ జాతికి అందే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
చిత్రం.. కిర్లంపూడిలో విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ముదగడ