ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రూ.1.16 లక్షల కోట్ల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 9: విభజన చట్టం ప్రకారం రూ.1.16 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉండగా కేంద్రం ఇచ్చింది రూ. 15 వేల కోట్లు మాత్రమేనని, ఇవేనా మీరు రాష్ట్రానికి అధికంగా కేటాయించామని చెప్పుకుంటున్న నిధులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ప్రశ్నించారు. కేంద్రానికి ఏపీ పన్నులు కట్టడం లేదా, ఆంధ్రప్రదేశ్‌పై కక్షతో శత్రుదేశాల కంటే దారుణంగా పరిగణిస్తూ, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ నవ్యాంధ్రలో పర్యటించడమంటే పుండుమీద కారం చల్లడం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి ప్రధాని మోదీకి కళావెంకట్రావ్ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ఏనాడూ అపాయింట్‌మెంట్ ఇవ్వని మోదీ ఎ-1 నిందితుడు జగన్మోహనరెడ్డి, ఎ-2 విజయసాయిరెడ్డిలకు సెలవు రోజుల్లో కూడా తలుపులు తెరిచి రెడ్ కార్పెట్ పరచడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిగా తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని ఒక నామం పెట్టారని, అమరావతి శంకుస్థాపన సభలో ఢిల్లీని మించిన అభివృద్ధి చేస్తామని మరో నామం పెట్టారని, ఇప్పుడు గుంటూరు సభలో మూడో నామం పెట్టేందుకు మోదీ వస్తున్నారా అంటూ ఎద్దేవాచేశారు. ఎన్డీయే నుంచి బయటకువచ్చాక జగన్మోహనరెడ్డిపై ఉన్న కేసుల విచారణ నెమ్మదించి, హైకోర్టు విభజన కారణంగా విచారణ తొలి ఛార్జిషీటు నుండి జరగాలనడంలో మోదీ హస్తం లేకపోలేదన్నారు. మీతో జరిగిన లోపాయికారీ ఒప్పందంతోనే జైలులో ఉండాల్సిన ఆర్థిక నేరస్తులంతా దర్జాగా రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్న మాట వాస్తవం కాదా అన్నారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వడం కేసుల మాఫీ కోసమేనన్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 24,350 కోట్లు రావాల్సినప్పటికీ రూ. 1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో రూ. 350 కోట్లు మోదీ ప్రమేయం లేకుండానే తిరిగి వెనక్కు వెళ్లాయా అని ప్రశ్నించారు. మూడు నెలల క్రితం కేంద్రప్రభుత్వం పంపిన స్టేటస్ నోట్‌లో ఏపీకి రూ. 14,310 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారని, అమిత్‌షా ఏకంగా 5.56 లక్షల కోట్లు ఇచ్చామని అసత్య ప్రచారం చేశారని, ఇప్పుడు మోదీ వచ్చి ఎంత చెప్తారో చూడాలన్నారు. డొలేరా నగరానికి, అహ్మదాబాద్‌లో కనె్వన్షన్ సెంటర్ నిర్మాణానికి, పటేల్, ఛత్రపతి విగ్రహాల నిర్మాణాలకు, బుల్లెట్ ట్రైన్‌లకు లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు మాత్రమే ఇవ్వడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. జాతీయ విద్యాసంస్థలకు రూ. 12,746 కోట్లు అవసరమైతే 845 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఈ విధంగా కేటాయింపులు తగ్గిస్తూ రాష్ట్రప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం తన 15 మంది ఎంపీలతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే 15 పార్టీలకు చెందిన 126 మంది ఎంపీలు మద్దతుగా నిలిచారంటే తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో అర్థమవుతుందన్నారు. తెలుగుదేశం అంటే ఒక పార్టీ కాదని, ఒక ప్రభంజనం అని, తెలుగువారి ఆత్మనినాదమని మోదీ గుర్తుంచుకోవాలని బహిరంగ లేఖలో స్పష్టంచేశారు.