ఆంధ్రప్రదేశ్‌

ఇది ఓ దుర్దినం.. చీకటి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక ఓ దుర్దినం..చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన అడుగులతో ఏపీ అపవిత్రమవుతుందని విమర్శించారు. విభజన గాయాలపై కారం చల్లేందుకే ప్రధాని వస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా రాష్టవ్య్రాప్తంగా నల్ల బ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ చేసిన దుర్మార్గాన్ని చూసి ఆనందించేందుకే మోదీ వస్తున్నారని, ఆయనకు రాష్ట్రంలోని ఓ దుర్మార్గుడు సహకరిస్తున్నారని ప్రతిపక్షనేత జగన్‌పై విరుచుకుపడ్డారు. మోదీ నమ్మక ద్రోహంపై ఒక్క మాట మాట్లాడని జగన్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవటంలో ముందున్నారని విమర్శించారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వాలను అస్థిర పరుస్తూ నాయకత్వాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాఫెల్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకు పోయిన ఆయన దొంగే దొంగనే చందంగా అరుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అవినీతి పార్టీలు ఇతరులపై అవినీతి నిందలు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలపై అవినీతి బురద జల్లుతున్నారని, అన్యాయం చేసిన వ్యక్తే రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని ఆక్షేపించారు. రాష్టవ్య్రాప్తంగా పసుపు చొక్కాలు, నల్లచొక్కాలు, పసుపు, నలుపు బెలూన్లతో ప్రధాని రాకను నిరసించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ధర్మపోరాటం గాంధీ మార్గమే లక్ష్యమన్నారు. జగన్ గత రెండేళ్లుగా శాసనసభ సమావేశాలకు రాకుండా నాలుగు సమావేశాలను బహిష్కరించారని, అలాంటి వాళ్లు ప్రజాసేవకు, రాజకీయాలకు అనర్హులన్నారు. మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానంలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ధర్మ పోరాటానికి మేం సిద్ధంగా ఉంటే, మమ్మల్ని నిందించేందుకే మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం జరిగే టీడీపీ ధర్మపోరాటం దేశానికే దిక్సూచి కావాలన్నారు. భావితరాలు, రాష్ట్రం కోసం ఈ పోరాటం చేస్తున్నామని అంతా సంఘీభావం తెలపాలని కోరారు. రాష్ట్రంలో కూడా దీక్షలు చేపట్టాలని, ఉద్యోగ సంఘాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. హక్కుల సాధన కోసమే ఈ సంకల్పమని సంకల్పాన్ని నెరవేర్చేదే ముందుచూపని అభివర్ణించారు. రూ 80వేల కోట్లతో 31లక్షల ఇళ్ల నిర్మాణం ఓ చరిత్ర అన్నారు. సంపన్నులకే పరిమితమైన గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను ప్రపంచ ప్రమాణాలతో అందుబాటులోకి తెచ్చి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెప్పారు. గతంలో పేదల ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రాష్టవ్య్రాప్తంగా 25 విమానాశ్రయాలు, 7 పోర్టులు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆరు రోజులు అసెంబ్లీలో చర్చలు ఫలప్రదంగా ముగిసాయన్నారు. అసెంబ్లీలో పాలసీ డాక్యుమెంట్ ప్రవేశపెట్టామని, బడ్జెట్‌లో ఈ ఏడాది ఏం చేస్తామో వివరించామన్నారు. దీంతో పాటు విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేశామన్నారు. గ్రామం, వార్డు నుంచి రాష్టస్థ్రాయి విజన్ ఏపీలోనే తొలిసారన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి చివర ఏడాది 20 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నామని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ఉద్యోగుల సంక్షేమంతో పాటు వీఆర్వో, వీఆర్‌ఏ, ఆశా, అంగన్ వాడీల జీతాలు పెంచామని గుర్తుచేశారు. హోంగార్డులకు వేతనాల పెంపుతో పాటు కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపుచేసి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పూర్తిచేశామని పునరుద్ఘాటించారు. యువతకు పెద్దఎత్తున ఉపాధి, మహిళలకు ఆర్థిక సాయం అందించాం..ఏ వర్గంలోనూ అశాంతిలేదు.. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీశ్రేణులకు నిర్దేశించారు. అభివృద్ధికి అడ్డుపడి, నేరాలకు పాల్పడుతూ అరాచకాలను ప్రోత్సహించే ప్రతిపక్షం అవసరంలేదనే భావన ప్రజల్లో కలిగించాలన్నారు. జగన్‌కు ఏమీ చేతకాదు.. అతనికి సభ్యతలేదు.. సంస్కారంలేదు.. మోదీతో లాలూచీపడి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు.. బీజేపీ, వైసీపీ లాలూచీని ఎండగట్టాలి.. ముగ్గురు మోదీలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.