ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా మేరీమాత మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గుణదల) ఫిబ్రవరి 10: విజయవాడలో జరుగుతున్న గుణదలమాత మహోత్సవాలకు రెండోరోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా గుణదల మేరీమాతను దర్శించుకోటానికి భక్తులు తరలిరావటంతో కొండ మార్గాలు, అన్ని ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. విజయవాడ రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ఉత్సవాలకు వచ్చే యాత్రికులతో కిటకిలాడాయి. కొండపై గుణదలమాతను, కొండ శిఖరాన యేసుక్రీస్తు శిలువను భక్తులు బారులుతీరి దర్శించుకున్నారు. టెంకాయలు కొట్టి మొక్కబడులు తీర్చుకున్నారు. కొందరు తలనీలాలు సమర్పించుకున్నారు. రెండోరోజు గుణదలమాత మహోత్సవాలకు గుంటూరు కేథలిక్ బిషప్ చిన్నాబత్తిన భాగ్యయ్య, ఏలూరు కేథలిక్ బిషప్ పొలిమెర జయరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం బిషప్ గ్రాసీ హైస్కూల్ ఆవరణలో ఆధ్యాత్మిక కళావేదికపై గుంటూరు, ఏలూరు, విజయవాడ కేథలిక్ బిషప్‌లు భాగ్యయ్య, జయరావు, తెలగతోటి జోసఫ్ రాజారావు, తదితర గురువులు సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. ఈసందర్భంగా బిషప్‌లు వ్యాఖ్యోప సందేశమిస్తూ ఈ లోకానికి దేవదేవుడిని అందించిన దివ్యమందసం పరిశుద్ధ కన్య మరియ అని అన్నారు. గుణదల కొండపై కొలువైన మరియమాత తన చెంతకు వచ్చే అశేష జనవాళిని క్రీస్తు చెంతకు చేరుస్తూ, భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా వినుతికెక్కిందని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కతోలిక పీఠం మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, రెక్టార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్ తదితర గురువులు, మఠకన్యలు పాల్గొన్నారు.