ఆంధ్రప్రదేశ్‌

నత్తనడకన పోలవరం ఎడమ ప్రధాన కాలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 10: పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జూన్ నాటికి గ్రావిటీపై నీరిస్తామని చెబుతున్న ప్రభుత్వం హెడ్‌వర్స్ పనులతో పాటు ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) పనులపై కూడా దృష్టిసారించాల్సివుంది. ఈ కాలువ పనులు కూడా పూర్తయితేనే నీరు అందించే వీలుంటుంది. ఈ కాలువ పరిధిలో రెండు చోట్ల రైల్వే క్రాసింగ్‌లు, పదిచోట్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్) క్రాసింగ్‌లు, మొత్తం ఏడుచోట్ల మేజర్ క్రాసింగ్‌లు జరగాల్సివుంది. ఇందులో ఇప్పటి వరకు కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులన్నీ జూన్ నాటికి గానీ, డిసెంబర్ నాటికి గానీ పూర్తయితేనే లక్ష్యం మేరకు నీరు విశాఖ జిల్లా కణితి నిజర్వాయరుకు చేరుతుంది. ఎడమ కాల్వ పొడవు సుమారు 211 కిలో మీటర్లు. మొత్తం 358 గ్రామాలకు తాగునీరు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, విశాఖలోని పారిశ్రామిక అవసరాలకు నీరు, జిల్లాకు తాగునీరు అందించడం ఎల్‌ఎంసీ లక్ష్యం. మొత్తం ప్రాజెక్టు అంచనా రూ.3645.15 కోట్లు. సాగునీటికి 84.808 టిఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టిఎంసీలు వెరసి 108.248 టిఎంసీల నీటిని సరఫరా చేస్తుంది. ఈ కాల్వ నిర్మాణానికి మొత్తం సుమారు 10,628 ఎకరాలు అవసరం కాగా ఇంకా 53.31 ఎకరాలు సేకరించాల్సివుంది.
ఇప్పటి వరకు సుమారు రూ.2320.50 కోట్లు ఖర్చుచేశారు. ఈ పనులను మొత్తం ఎనిమిది ప్యాకేజీలుగా చేపట్టారు. ఇందులో ఒకటవ ప్యాకేజీలో 50 స్ట్రక్చర్లు, రెండో ప్యాకేజీలో రెండు ఎన్‌హెచ్ క్రాసింగ్‌లతో పాటు 43 స్ట్రక్చర్లు, మూడో ప్యాకేజీలో రెండు ఎన్‌హెచ్ క్రాసింగ్‌లతో పాటు 47 స్ట్రక్చర్లు, ప్యాకేజీ నాలుగులో కూడా మూడు ఎన్‌హెచ్ క్రాసింగ్‌లతో పాటు 47 స్ట్రక్చర్లు, ఐదవ ప్యాకేజీలో ఒక ఎన్‌హెచ్ క్రాసింగ్‌తో పాటు 46 స్ట్రక్చర్లు, ఆరవ ప్యాకేజిలో 71 స్ట్రక్చర్లు, ఏడవ ప్యాకేజీలో 68 స్ట్రక్చర్లు, ఎనిమిదవ ప్యాకేజీలో రెండు రైల్వే క్రాసింగ్‌లు, రెండు ఎన్‌హెచ్ క్రాసింగ్‌లతో పాటు మొత్తం 81 స్ట్రక్చర్లు పూర్తికావాల్సివుంది. ఎనిమిద ప్యాకేజీలోనే కొంత భూసేకరణ చేయాల్సివుంది. కొన్ని చోట్ల స్ట్రక్చర్ల పనులు నత్త నడకన సాగుతున్నాయి.
జాతీయ రహదారి క్రాసింగ్‌లు పూర్తయితే తప్ప కనీసం నీరు లక్ష్యం వరకు చేరే అవకాశంలేదు. ట్విన్ టనె్నల్స్‌తో పాటు, 16వ నెంబర్ జాతీయ రహదారి క్రాసింగ్‌లవద్ద వంతెన పనులు, ఉప నదులు, వాగులు, కాలువలు, పంపా, తాండవ వంటి నిర్మాణాల వద్ద స్ట్రక్చర్ పనులు వేగంగా పూర్తిచేయాల్సివుంది. ప్రభుత్వం హెడ్ వర్క్సును నిర్ధేశిత లక్ష్యం మేరకు పనులను పరుగులు పెట్టిస్తున్నట్టే, ఎడమ ప్రధాన కాలువ పనులపై కూడా దృష్టిపెట్టకపోతే లక్ష్యం దూరమే మరి.