రాష్ట్రీయం

రాయలసీమకు రైల్వే శాఖ ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఫిబ్రవరి 10 : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నంద్యాల మీదుగా రాజధాని అమరావతి వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నింటినీ రైల్వే శాఖ మరమ్మతుల పేరిట ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకూ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రద్దు చేసింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించలేక తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇటు బెంగళూరు నుంచి రాజధాని అమరావతి, హుబ్లీ నుంచి అమరావతి, హైదరాబాద్ నుంచి అమరావతి, డోన్ నుంచి నంద్యాల మీదుగా అమరావతి వెళ్లే మొత్తం 6 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో కేవలం రాత్రిపూట తిరిగే 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే ఈ మార్గంలో తిరుగుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కరువు కాలంలో ఉపాధి వెతుక్కునేందుకు అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, అటు హుబ్లీ, ఇటు రాజధాని అమరావతి వైపు వెళ్లేందుకు ప్యాసింజర్ రైళ్లు లేకపోవడంతో బస్సుల్లో ప్రయాణించలేక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చోటు దొరక్క తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇక పెళ్లిళ్లు, పేరంటాలు ఇలాంటి వాటికి వెళ్లే పేద, మధ్య తరగతి వారు కూడా తమ ప్రయాణాలు, కార్యక్రమాలను రద్దు చేసుకోవడం, వాయిదా వేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో సీమ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లలో ఎక్కువ భాగం వలస కూలీలు ప్రయాణిస్తుంటారు. ఉపాధి మార్గాలు వెతుక్కోవడంతో పాటు పనుల కోసం హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, విజయవాడ నగరాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ వేసవి పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉండేందుకు ప్రణాళికలు వేసుకున్న వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
రైల్వే శాఖ ఈ మార్గంలో మరమ్మతుల పేరిట ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. కానీ ఇదే మార్గంలో ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లను మాత్రం నడపడం విమర్శలకు తావిస్తోంది. ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో నిరభ్యంతరంగా రాకపోకలు సాగిస్తుండగా, కేవలం పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను ఎందుకు రద్దు చేశారని ప్రయాణికులు వాపోతున్నారు. నంద్యాల రైల్వేస్టేషన్ మీదుగా తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే వెళ్తాయి. రాత్రిపూట ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి. అయితే రైల్వే శాఖ స్వలాభం కోసం ప్యాసింజర్ రైళ్లను ఆపేసి గూడ్స్ రైళ్లను ముందుకు పంపడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా మారింది. ఇదేమిటని ప్రశ్నిస్తే రైల్వేశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇకనైనా రైల్వేశాఖ ఉన్నతాధికారులు పేద, మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కనీసం రెండు, మూడు ప్యాసింజర్ రైళ్లను అయినా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.