ఆంధ్రప్రదేశ్‌

15న డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: ఈ నెల 15న 2018 డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గతేడాది డిసెంబర్, 2019 జనవరిలో రెండు విడతలుగా జరిగిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించి అర్హుల జాబితాను ప్రకటించేందు అంతా సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఈ పరీక్షలకు 6,08,155 మంది దరఖాస్తు చేసుకోగా, 5,05,542 మంది (85.81 శాతం) హాజరయ్యాయరని తెలిపారు. డీఎస్సీ 2018 ద్వారా అన్ని విభాగాల్లోనూ 7,902 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. డీఎస్సీ 2018కి సంబంధించి తుది కీ ఈ నెల 13న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 600పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి గంటా పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించే ఏడు రకాల సెట్‌లకు సంబంధించి క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నామని, అనుకున్న ప్రకారం పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీఈసెట్‌ను జెన్‌టీయూ అనంతపురం నిర్వహిస్తుందని, దీనికి ప్రొఫెసర్ భానుమూర్తి కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఏపీఈసెట్ ఏప్రిల్ 19న నిర్వహించి, మే 30న ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. అలాగే ఏపీఎంసెట్ (ఇంజనీరింగ్) పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 22 వరకూ, ఎపీఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్ష ఏప్రిల్ 24న జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహిస్తుందని, కన్వీనర్‌గా ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు వ్యవహరిస్తారన్నారు. ఎపీఎంసెట్ పరీక్షా ఫలితాలు మే 1వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఏపీఐసెట్ పరీక్షలు ఏప్రిల్ 26న ఎస్‌వీ యూనివర్శిటీ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారన్నారు. వీటి ఫలితాలను మే 3న విడుదల చేస్తామన్నారు. ఏపీపీజీసెట్ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకూ ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ప్రొఫెసర్ పీఎస్ అవధాని కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. వీటి ఫలితాలు మే 11న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఏపీఎడ్‌సెట్ పరీక్షలు మే 6న ఎస్‌వీ యూనివర్శిటీ తిరుపతి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ టీ కుమారస్వామి కన్వీనర్‌గా నిర్వహిస్తామని, ఫలితాలు మే 10న విడుదల చేస్తామన్నారు. ఏపీలాసెట్ పరీక్షలు మే 5న ఎస్‌కే యూనివర్శిటీ అనంతపురం ఆధ్వర్యంలో ప్రొఫెసస్ ఐ విజయ్‌కుమార్ కన్వీనర్‌గా నిర్వహిస్తామని, ఫలితాలు మే 13న విడుదల చేస్తామన్నారు. అలాగే ఏపీపీసెట్ పరీక్షలు మే 8 నుంచి 15 వరకూ నాగార్జున యూనివర్శిటీ గుంటూరు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ పీఎస్‌ఎస్ పాల్‌కుమార్ కన్వీనర్‌గా నిర్వహిస్తామని, ఫలితాలు మే 25న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఇంటర్, ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గంటా తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకూ నిర్వహిస్తామన్నారు. తొలి సంవత్సరం పరీక్షకు 4,76,417 మంది, ఓకేషనల్ కోర్సులకు 30,885 విద్యార్థులు హాజరుకానున్నారు. రెండో సంవత్సరం పరీక్షకు 4,80,684 మంది, ఓకేషనల్ కోర్సులకు 29,614 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు.
ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయని, 6,21,623 మంది హాజరుకానున్నారని తెలిపారు.
రాష్టవ్య్రాప్తంగా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్వొకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలన్నది నిర్ణయిస్తామన్నారు. కాంట్రాక్టు విధానంలో పనిచేసిన ప్రొఫెసర్లకు ఇప్పటికే మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనల్ సంధ్యారాణి, ఏయూ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు