ఆంధ్రప్రదేశ్‌

ప్రజాక్షేత్రంలోకి బనగానపల్లె నవాబుల కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఫిబ్రవరి 12: కర్నూలు జిల్లా బనగానపల్లె నవాబుల కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకుంది. ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవచేయాలని నిర్ణయించినట్లు నవాబుల వంశీకులు మీర్ ఫజుల్ అలీఖాన్ తెలిపారు. తమ పూర్వీకుల వారసత్వాన్ని కాపాడుతూ నాటి సంప్రదాయాలు, పద్దతులను నేటికి అనుసరిస్తున్నామని తెలిపారు. మంగళవారం నవాబు వంశీకులు కోటలో తొలిసారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ ఇకపై బనగానపల్లె ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామన్నారు. ముస్లింలతో పాటు ఇతర మతాలు, కులాల వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ప్రజాసేవ చేయాలన్న తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 1947 వరకు 64 గ్రామాలతో బనగానపల్లె సంస్థానాన్ని తమ పూర్వీకులు పాలించారని, స్వతంత్ర చట్టాలు కూడా చేశారని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో బనగానపల్లె అభివృద్దికి కట్టుబడి బెంగళూరు నగరాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, రోడ్లు, డ్రైనేజీ విస్తరణ చేపట్టారని గుర్తు చేశారు. పట్టణంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ వైద్యశాల, జూనియర్ కళాశాల, ఎంపీడీఓ, తహసీల్లాదారు, ఆర్ అండ్ బీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్ తర్వాత బనగానపల్లెలో మొహరం పండుగను పెద్దఎత్తున జరుపుకుంటున్నామన్నారు. అప్పట్లో చావడుల ఖర్చు తామ వంశీకులే భరించేవారన్నారు. కాలగమనంలో చావడుల నిర్వాహకులే భరిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. అలాగే షియా తెగ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
పాతపాడు బంగ్లాకు పూర్వవైభవం
గుత్తి మార్గంలోని పాతపాడు వద్ద తమ పూర్వీకులు నిర్మించిన బంగ్లా ఎంతో చారిత్రక ప్రసిద్ది చెందిందని, దానికి పూర్వవైభవం కల్పించేందుకు కృషి చేస్తామని నవాబు అలీఖాన్ తెలిపారు. బంగ్లా పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బంగ్లా నిర్వహణ కోసం ఇకపై పర్యాటకుల నుండి కొంత రుసుం వసూలు చేస్తామని తెలిపారు. బంగ్లాను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని నవాబు మీర్ ఫజుల్ అలీఖాన్ తెలిపారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బనగానపల్లె నవాబుల వంశీకుడు మీర్‌ఫజుల్ అలీఖాన్