ఆంధ్రప్రదేశ్‌

డేటా అనలిటిక్స్‌కు పునాది.. అభివృద్ధికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: ఒకప్పుడు ఐటీని రాష్ట్రానికి పరిచయం చేసి రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన తాను డేటా అనలిటిక్స్‌కు పునాది వేస్తున్నానని, ఉజ్వల భవిష్యత్‌కు ఇది నాందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదానీ గ్రూపు విశాఖలో రూ.70 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్కుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఇరవై ఏళ్ల కిందట తాను హైదరాబాద్, సికింద్రాబాద్‌కు దీటుగా ఐటీకి ప్రాధాన్యతనిచ్చి తీర్చిదిద్దిన నగరానికి సైబరాబాద్‌గా నామకరణం చేశానన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా అనలటిక్స్‌తో విశాఖను కొత్త ప్రపంచంగా మారుస్తామన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకూ నాలెడ్జ్ పార్క్, ఐటీ రంగాల్ని అభివృద్ధి పరచడం ద్వారా విశాఖను నార్తర్న్ వర్జీనియా సిటీగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఇన్నోవేషన్ వేలీ అంటే ముందుగా భారత్, భారత్‌లో ఏపీ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో టెలికాం రంగంతో తాను చేసిన సూచనలే ఇప్పుడు డేటా అనలటిక్స్‌లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాయన్నారు. సంస్థల అవసరాలకు తగినట్టుగా మానవ వనరులను అభివృద్ధి చేస్తామని పెట్టుబడులు పెట్టే సంస్థలకు హామీ ఇచ్చారు. రెండు దశాబ్దాల కిందట కేవలం 25 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే తాను అధికారం చేపట్టిన అనంతరం 250కి పెంచామన్నారు. తద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మానవ వనరుల కొరత తీరిందన్నారు.
ఇప్పటి అవసరాలకు తగిన విధంగా మానవ వనరులను అందిస్తామన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సాంకేతికతతో రాష్ట్రాన్ని సిలికాన్ వేలీ తరహాలో అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటామన్నారు. ప్రైవేట్ రంగంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు సాధించిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ఈ సందర్భంగా అదానీ గ్రూపు తనపై నమ్మకంతో ఇక్కడ సంస్థను ఏర్పాటు చేసేందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం నాలుగు నెలల కాలంలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసిందన్నారు. జనవరిలో ఎంవోయూ కుదుర్చుకున్న అదానీ సంస్థకు అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చామని, సంస్థ కూడా అనుకున్న మేరకు నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. విశాఖ రుషికొండలో 1350 ఎకరాల్లో ఐటీ సంస్థలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని, ఈప్రాంతానికి క్లౌడ్ సిటీగా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. అదానీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదాని మాట్లాడుతూ రాబోయే దశాబ్ద కాలంలో ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సమన్వయంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. డేటా వినియోగం, డేటా ఉత్పాదకత వంటి అంశాల్లో ఏపీని భవిష్యత్‌లో నెంబర్ వన్‌గా నిలుపుతామన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులతో డేటా సెంటర్‌ను నిర్వహించేలా ఈ సెంటర్‌ను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర జీడీపీ 1 శాతం పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు ఉద్యోగాలు ఇచ్చేలా ఎదగాలని, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉండకూడదన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక సంస్థ ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం గర్వకారణంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదానీ గ్రూప్ సీఈవో సుదీప్త భట్టాచార్య, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కే విజయానంద్, మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. అదాని గ్రూప్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్కు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరిస్తున్న
సీఎం చంద్రబాబు, అదాని గ్రూపు ఎండీ రాజేష్ అదాని