ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర వేడుకలుగా ప్రముఖుల జయంతి, వర్ధంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి, ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించిన ప్రముఖుల జయంతులు, వర్ధంతులను రాష్ట్ర వేడుకలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బళ్లారి రాఘవ (ఆగస్టు 2), త్రిపురనేని రామస్వామి చౌదరి (జనవరి 15), పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28) జయంతులను, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (డిసెంబర్ 15), అల్లూరి సీతారామరాజు (మే 7), పొట్టి శ్రీరాములు (డిసెంబర్ 15) వర్ధంతులను ఇకపై రాష్ట్ర వేడుకలుగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందుకు అవసరమై బడ్జెట్‌ను రెగ్యులర్ బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.