ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా పెనుకొండ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 14: శ్రీ కృష్ణదేవరాయల 509వ పట్ట్భాషేక మహోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండలో రెండు రోజుల పాటు జరిగే పెనుకొండ ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, కళాకారులు, ప్రజలు, అధికారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాయల కీర్తి, వైభవం ఇనుమడింప చేసేలా ప్రాచీన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.