ఆంధ్రప్రదేశ్‌

స్వార్థ ప్రయోజనాల కోసమే అవంతి పార్టీ ఫిరాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 14: ఎంతో ప్రాధాన్యతనిచ్చి పదవులు కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీకి ఎంపీ అవంతి శ్రీనివాస్ నమ్మకద్రోహం చేశారని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ పంచన చేరిన అవంతి త్వరలో కూరలో కరివేపాకులా మారడం తథ్యమని పాయకారావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలో చేరిన అవంతిని ప్రజలు చీత్కరించడం ఖాయమని స్పష్టంచేశారు. గురువారం ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం, ఎన్‌టిఆర్ భవన్ నుండి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖకు హుదూద్ తుపాను బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న జగన్ పార్టీలో చేరడం అక్కడి ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. తిత్లీ, పెథాయ్ తుపాన్‌లు వస్తే కనీసం బాధితులను ఆదుకోవాలని పిలుపు సైతం ఇవ్వని జగన్ పార్టీలోకి వెళ్లి ప్రజాసేవ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. అవినీతికి పేటెంట్‌గా ఉన్న జగన్మోహనరెడ్డిని కలిసిన అనంతరం అవంతి శ్రీనివాస్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఉగ్రవాదిలా మారాడని గతంలో విమర్శించిన అవంతి ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీలో చేరావంటూ నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ బలంతోనే 2014లో పార్లమెంటు సభ్యుడిగా ఎంపికైన విషయాన్ని అవంతి గుర్తుంచుకోవాలని సూచించారు. కాపులకు రిజర్వేషన్‌లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి కాపుమిత్ర చంద్రబాబు అని, తెలుగుదేశం చేసిన మేలు ఎవ్వరూ చేయలేదని అవంతి శ్రీనివాస్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.