ఆంధ్రప్రదేశ్‌

నగరం మనదేనన్న భావన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: నగరం మనదేనన్న భావన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందని ఇటలీ కాన్సుల్ జనరల్ (ముంబై) స్ట్ఫోనియా కోస్టాంజ అభిప్రాయ పడ్డారు. విజయవాడలో జరుగుతున్న సంతోష నగరాల సదస్సులో భాగంగా యువ పారిశ్రామికవేత్తలకు వైబ్రంట్ ఎకో సిస్టమ్ అన్న అంశంపై గురువారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ ఇటలీలో ప్రజలు కలుసునేందుకు వీలుగా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. రహదారులు తదితర చోట్ల కలుసుకునేలా డిజైన్ చేస్తామని వెల్లడించారు. తమ దేశంలో మాస్టర్ ప్లాన్ చట్టం అమల్లో ఉంటుందన్నారు. ప్రజల అలవాట్లు, తదితర అంశాలను తెలుసుకుని నగరాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తారన్నారు. యువత ఉపాధిపైనే కాకుండా సంస్కృతి, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త భవనాలు నిర్మిస్తున్నా పాత భవనాలకు మరమ్మతులు చేసి పాత తరాన్ని కూడా కొనసాగిస్తామన్నారు. దీని వల్ల నగరాలకు ప్రాధాన్యత పెరుగుతుందని, ప్రజలు ఈ నగరం తమదే అన్న భావన కలిగి ఉండాలన్నారు.
అనంతరం డిజిటల్ యుగంలో భౌతిక, మానసిక పరిస్థితులపై జరిగిన చర్చలో థింపూ మేయర్ కిన్‌లే దోర్జీ మాట్లాడుతూ ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. నదీ తీరాల నుంచి 30 మీటర్ల వరకూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రతిపాదించామన్నారు. బ్రిటన్‌కు చెందిన హ్యాపీ సిటీ సీఈవో లిజ్ జీడ్లర్ మాట్లాడుతూ జీడీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీని వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు సంతోషంగా ఉండే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అనంతరం జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమానికి హ్యాపీ సిటీ రచయిత చార్లెస్ మోంట్‌గోమెరీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.