ఆంధ్రప్రదేశ్‌

దేశానికే తలమానికం మెగా సీడ్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 14: అమెరికాకు చెందిన అయోవా యూనివర్శిటీ సహకారంతో కర్నూలు జిల్లా తంగడంచెలో నిర్మిస్తున్న మెగాసీడ్ పార్కు దేశానికే తలమానికంగా నిలుస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మెగాసీడ్ పార్కు పనుల పురోగతిపై గురువారం మంత్రి సోమిరెడ్డి నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో కలెక్టర్ సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 315.34 కోట్ల వ్యయంతో అయోవా యూనివర్శిటీ సమర్పించిన డీపీఆర్‌ను బోర్డు డైరెక్టర్స్ ఆమోదించారన్నారు. అలాగే రూ. 27.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, రూ. 16.5 కోట్లతో ప్రహరీ, రూ. 7.66 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు పరిపాలన అనుమతులు లభించాయన్నారు. మిగిలిన వౌలిక వసతుల కల్పనకు ఈ నెలాఖరులోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో భూగర్భజలాల పెంపునకు 17 ఫారంపాండ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను అదేశించారు. కేసీ కెనాల్ నుంచి నీటిని తీసుకునేందుకు స్లూరుూస్‌ల మరమ్మతులకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఏపీఎస్‌పీడీపీ లిమిటెడ్ నుంచి ఐదెకరాలు, ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్శిటీ నుంచి 10 ఎకరాలు, ఉద్యానశాఖ నుంచి ఐదెకరాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు అందాయన్నారు. 606.02 ఎకరాల విస్తీర్ణం గల ఈ మెగాసీడ్ పార్కులో 74.17 ఎకరాల్లో 140 ప్లాట్లు కేటాయిస్తున్నామన్నారు. 5 ఎకరాల ప్లాట్లు 3, 2.5 ఎకరాల ప్లాట్లు 95, 1.5 నుంచి 2.5 ఎకరాల ప్లాట్లు 15, 2.5 నుంచి 3.6 ఎకరాల ప్లాట్లు 23, 4.5, 5.5 ఎకరాల విస్తీర్ణంలో 4 ప్లాట్లుగా కేటాయించామన్నారు. 65.07 ఎకరాల్లో రోడ్లు, 17.96 ఎకరాల్లో 17 ఫారంపాండ్లు, 44.16 ఎకరాల్లో గ్రీన్ ఏరియా, 9.52 ఎకరాల్లో రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటేస్, 868 ఎకరాల్లో ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 7.13 ఎకరాల్లో జనరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 9.6 ఎకరాల్లో మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఫెసిలిటేస్, 20.44 ఎకరాలను డెమో ప్లాట్లకు కేటాయించామన్నారు. రైతు ఉత్పత్తిదారులు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 18.708 ఎకరాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, యూనివర్శిటీలు, పబ్లిక్ సీడ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలకు 18.708 ఎకరాలు, వ్యవసాయ యూనివర్శిటీలకు 10 ఎకరాలు, ఏపీ స్టేట్ మెగా సీడ్ పార్కు భవిష్యత్తు అవసరాలకు 37.417 ఎకరాలు, ఎంఎస్, ఎంఈలకు 37.417 ఎకరాలు, ప్రైవేట్ సీడ్ కంపెనీలకు 168.367 ఎకరాలు, స్టార్ట్ అప్స్‌నకు 7.48 ఎకరాలు, ఇతరులకు 7.91 శాతం భూ కేటాయింపుల ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.
సింగపూర్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.