ఆంధ్రప్రదేశ్‌

రూ.70 కోట్లకు పెరిగిన పోలవరం ‘సందర్శన’ బడ్జెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మాదిరిగానే ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలకు అవుతున్న వ్యయం కూడా పెరుగుతోంది. భారీఎత్తున నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలంతా దర్శించుకోవాలని ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రాజెక్టు సందర్శనకు ఆసక్తి చూపే వారికోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడమేకాక, భోజన సదుపాయం సైతం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.19 కోట్లు కేటాయించింది. అయితే ఆ వ్యయం ఇప్పటికే రూ.22కోట్లకు చేరుకుంది. ఇంకా నిత్యం సందర్శకుల తాకిడి గణనీయంగా ఉండటంతో ఈ మొత్తాన్ని రూ.70 కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రూ.70 కోట్ల వరకు బడ్జెట్ పెంచి కేటాయించాలని ప్రతిపాదిస్తూ ఆమోదానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కు లేఖ రాశారు. రోజుకు జిల్లాకు రెండేసి బస్సుల చొప్పున సందర్శనకు వచ్చే విధంగా బడ్జెట్‌ను కేటాయించారు. సందర్శకులకు ట్రాన్స్‌పోర్టుతో పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చేవారికైతే రెండు పూటల భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రోజుకు 13 జిల్లాల నుంచి దాదాపు 100 బస్సుల్లో జనం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో సందర్శకులతో నిత్యం సందడిగా మారుతోంది. రోజుకు వంద బస్సుల వరకు వస్తూ, వెళ్తుండటంతో గట్టు రోడ్డయితే ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఎదురవుతోంది. వారం రోజుల్లోనే మొత్తం లక్షా 30వేల 778 మంది సందర్శించారంటే రద్దీని అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 4వ తేదీ వరకు పరిశీలిస్తే..మొత్తం 293 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 7 లక్షల 97 వేల 362 మంది ప్రాజెక్టును సందర్శించారు.
రూ.4021 కోట్లు రీయింబర్స్ అయితేనే...
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు అయిన ఖర్చులో ఇంకా కేంద్రం నుండి రూ.4021 కోట్లు రీయింబర్స్ కావాల్సివుంది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు పరిశీలిస్తే రూ.15వేల 8వందల 84 కోట్ల 13 లక్షలు ఖర్చయ్యింది. ఇందులో ఇంకా రూ.4021 కోట్లు రీయింబర్స్ కావాల్సివుంది. ఈ నిధులు మంజూరైతే మినహా పనులు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడంలేదు. ఇందులో ఆర్ అండ్ ఆర్, హెడ్ వర్క్సు, భూసేకరణకు సంబంధించిన అన్ని బిల్లులు సమర్పించారు. నెలాఖరుకైనా నిధులు మంజూరైతే కష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా మరో రూ.1960 కోట్ల వరకు బిల్లులు పీపీఏకు సమర్పించారు. మరో రూ.538 కోట్లకు బిల్లులు సిద్ధంగా వున్నాయి. సవరించిన డీపీఆర్ రూ.57,940.86 కోట్లు అంచనా కాస్తా పోలవరం సాంకేతిక కమిటీ ఆమోదం పొందిన నేపధ్యంలో మిగిలిన ఆమోదాలు లభించిన వెంటనే మొదటగా రూ.4021 కోట్లు రీయింబర్స్ అయ్యే ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు.

సంతోషమే పరమావధి!
జీడీపీ కన్నా... జీఎన్‌హెచ్ ముఖ్యం * థింపూ మేయర్ కినే్ల దోర్జీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: భూటాన్‌లో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కన్నా జాతీయ స్థూల సంతోష (జీఎన్‌హెచ్) సూచికే ప్రాధాన్యమిస్తామని ఆ దేశ రాజధాని థింపూ నగర మేయర్ కినే్ల దోర్జీ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ సంతోషాలు వెల్లివిరిసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న సంతోష నగరాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తమ దేశ నాలుగో రాజైన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ తొలిసారిగా 1972లో జీఎన్‌హెచ్ మదింపునకు శ్రీకారం చుట్టామన్నారు. ఆర్థికేతర అంశాలకు, భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యత కలిగిన సుస్థిర అభివృద్ధి ఈ విధాన లక్ష్యమన్నారు. 17 సంవత్సరాల వయసులోనే ఆయన రాజుగా బాధ్యతలు చేపట్టారని, అప్పటి నుంచి సంతోష సూచిపై కసరత్తు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో కూడా సంతోషాల స్థాయిని మదింపు చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. 2010లో దేశంలో సంతోషానికి సంబంధించి గ్రామాలు సహా పట్టణాల్లో సర్వే నిర్వహించామన్నారు. నాలుగు ప్రధానాంశాలకు సంబంధించి 73 సంతోష సూచిల ఆధారంగా ప్రశ్నలు తయారు చేశామన్నారు. దీనిపై ప్రజల అభిప్రాయాలను విశే్లషించి, సంతోష స్థాయిని మదింపు చేశామన్నారు. 2010లో సంతోష సూచి 73 శాతం ఉండగా, 2015 నాటికి 95 శాతానికి చేరిందన్నారు. గ్రామాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తోందని, పేదరికం తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైందన్నారు. 45 సంవత్సరాల శ్రమ ఫలితాలను ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ దేశ ప్రణాళికా సంఘం పేరు కూడా జీఎన్‌హెచ్ కమిషన్‌గా మార్చామన్నారు. దేశంలో ఏదైనా ప్రాజెక్టు, విధానం లేదా ప్రణాళిక రూపకల్పన చేస్తున్న సమయంలో తప్పనిసరిగా జీఎన్‌హెచ్‌ను కూడా పరిగణలోకి తీసుకుని వడబోస్తామన్నారు. ఏ ప్రాజెక్టు అయినా వాతావరణాన్ని కలుషితం చేసే, కాలుష్యాన్ని పెంచే, ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపించేది అయితే అటువంటి ప్రాజెక్టు తమకు అవసరం లేదన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభిస్తున్నా, పర్యావరణానికి చేటు కల్గించేది అయితే చేపట్టబోమన్నారు. తమ దేశంలో మద్యపానాన్ని నిషేధించే ఆలోచన లేదని, కానీ దాని వల్ల వస్తున్న వివిధ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మద్యం వల్ల సమాజంపై చెడు ప్రభావం ఎక్కువగా ఉందని, అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని, పిల్లలు కూడా అలవాటుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాగుడు వల్ల వచ్చే వ్యాధుల చికిత్సకు నిధుల కేటాయింపు తమకు సమస్యగా మారుతోందన్నారు. ప్రభుత్వం సహకరిస్తే మద్యం అమ్మకాలు క్రమబద్ధీకరించడం, పన్ను పెంచడం వంటివి చేసే ఆలోచన ఉందన్నారు. పన్ను పెంచడం వల్ల కొంతమంది అయినా తగినంత డబ్బులేక మానేసే వీలు ఉంటుందన్నారు. తమ దేశంలో ఉద్యోగులు కుటుంబంతో తగినంత సమయం గడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తన కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 5 దాటాక పని చేయవద్దని చెబుతుంటామన్నారు. తండ్రిగా, తల్లిగా తమ బాధ్యతలను నిర్వహించాలని సూచిస్తుంటానన్నారు. సమాజంలో కుటుంబ వ్యవస్థ కీలమని, కుటుంబం కోసమే పని చేస్తుంటారని, వారి కోసం సమయం కేటాయించాలని తమ అభిప్రాయమన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల చాలా మేలు జరుగుతుందని, జీవితాన్ని సుఖమయం చేస్తుందన్నారు. కానీ టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించడం తెలియకపోతే ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్లకు, ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడితే ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నారు. బాధ్యత కలిగిన తల్లితండ్రులు తమ పిల్లలకు చదువు, వినోదానికి, ఆటపాటలకు కచ్చితమైన సమయాలు కేటాయించడం బాధ్యతన్నారు. డిజిటల్ పరికరాలు, టీవీల వల్ల కలిగే నష్టం గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నామన్నారు. పిల్లలను బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు దార్శనికత వల్ల ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా అమరావతి ఆవిర్భవిస్తుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల నుంచి మాదక ద్రవ్యాలు, మద్యం అమ్మకాల కారణంగా నేరాలు జరుగుతున్నాయన్నారు. దీనిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పిల్లలు తాగుడుకు అలవాటు పడటం నేరప్రవృత్తి వైపు మళ్లేందుకు మొదటి మెట్టన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టుల ఎంపికలో వ్యవహరిస్తున్న వైఖరి తదితర కారణాలతో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నామని, దీనిని అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు
థింపూ నగర మేయర్ కినే్ల దోర్జీ
ప్రపంచ దేశాలకే తలమానికం ‘బసవతారకం’

* ఇక్కడి నుంచే క్యాన్సర్ నివారణకు అంతర్జాతీయ వైద్యసేవలు
* క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

గుంటూరు, ఫిబ్రవరి 14: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అందించే వైద్యసేవలు భవిష్యత్తులో రాష్ట్రానికే కాకుండా, ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలుస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం అమరావతి రాజధాని పరిధిలోని తుళ్లూరు వద్ద 15 ఎకరాల్లో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ దంపతులు భూమిపూజ, శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టీ రామారావు సతీమణి బసవతారకం క్యాన్సర్ వ్యాధితో బాధపడే సమయంలో భారతదేశంలో అంతగా క్యాన్సర్ నివారణ ఆసుపత్రులు లేకపోవడంతో చివరకు ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించిందని తెలిపారు. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి నాంది పలికిందని తెలిపారు. దాతల సహకారంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి చెంది ఎంతో మంది ప్రాణాలను కాపాడిందన్నారు. పొగాకు వినియోగం, వ్యవసాయరంగంలో విచ్ఛలవిడిగా ఎరువులు, పురుగుమందుల వాడకం అధికమైన నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
దీనిని నిరోధించేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ప్రకృతి వ్యవసాయ నిర్వహణ 0.3 శాతంగా ఉండగా, భారత్‌లో 0.8 శాతం ఉందని, మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా 8 శాతానికి చేరుకుందని తెలిపారు. అమరావతి రాజధాని పరిధిలో 14 వైద్య కళాశాలలు, ఆసుపత్రులు రానున్నాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మెడికల్ హబ్‌గా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు.
శాసన సభాపతి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ 1989 జూలై 26న దివంగత ఎన్‌టీఆర్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను నిర్మించామన్నారు. క్యాన్సర్ రోగ నిర్ధారణలో, వైద్య చికిత్సలు అందించడంలో భారత్‌లోని ప్రధాన క్యాన్సర్ హాస్పిటల్స్‌లో బసవతారకం ఒకటని పేర్కొన్నారు. హాస్పటల్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల సేవే ధ్యేయంగా స్వలాభాపేక్ష లేని సంస్థగా ఎదగడమే ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ తులసీదేవి పోలవరపు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎన్‌ఎండి ఫరూక్, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ దంపతులు