ఆంధ్రప్రదేశ్‌

వాస్తవాలను తొక్కిపెట్టారు.. కాగ్‌ను తప్పుదోవ పట్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: రాఫెల్ కుంభకోణానికి సంబంధించిన అసలు వాస్తవాలు కాగ్‌కు తెలియకుండా ప్రధాని కార్యాలయం (పీఎంవో) వ్యవహరించిందనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ యుపీఏ డీల్ కన్నా ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల 2.8 శాతం వరకు ధర తగ్గిందని, తద్వారా దేశానికి మేలు జరిగిందన్నట్లు ప్రసారమాథ్యమాల్లో వచ్చిన కథనాలపై విశే్లషించారు. వాస్తవానికి 2.8 శాతం తక్కువ కానేకాదని, దాదాపు 7 నుంచి 9 శాతం వరకు తయారీ ధర పెరిగిందని వివరించారు. కాగ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలను ప్రతి ఒక్కరూ నిశితంగా గమనించాలన్నారు. కాగ్ నివేదిక ప్రకారం ముందుగా ఫర్ఫార్మెన్స్ గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ, సావనీర్ గ్యారంటీ లేకుండా ఈ ఒప్పందం ఎలా జరిగిందో స్పష్టం చేయాలన్నారు. యుద్ధ విమానాల తయారీకి ముందుకొచ్చిన ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ చూపాలన్నారు. అవేవీ లేకుండా పీఎంవో జోక్యంతో తయారీ ధరల్లో వ్యత్యాసం వచ్చిందన్నారు. తాజాగా పెట్టిన ఆర్బ్రిటేషన్ క్లాజ్ వల్ల న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఫ్రెంచ్ న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మనదేశంలో వాటిని పరిష్కరించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో 36 యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఒప్పందం కుదిరినప్పుడు ప్రధాన ఆడిటర్‌గా ఉన్న రాజీవ్ అనే అత్యున్నత అధికారే ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో కాగ్ నివేదిక తయారీలో కూడా కీలకంగా వ్యవహరించారనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎవరైతే రాఫెల్ ఒప్పందం కుదిర్చారో, వారే ఇప్పుడు అందులో ఏ విధమైన కుంభకోణం లేదని క్లీన్‌చిట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమో, అందులోని విశ్వసనీయత ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలని రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్