ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్వీప్ ఖాయం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శుక్రవారం ఆయన 32 కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశమయ్యారు. ఎన్నికల వరకూ ప్రజాక్షేత్రంలో మెలగాల్సిన అవసరం, ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన అంశాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంపై 79.25శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. నాలుగున్నర ఏళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అయిందన్నారు. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్లు, ఆయా వర్గాల్లోనే కాకుండా, ప్రతిపక్ష నేతలు, మేథావులు, సేవాతత్పరుల విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల ఆదరాభిమానాలను పొందాలన్నారు. గతంలో ఏ పార్టీ చేయని రీతిలో అన్ని కులాలు, వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్న ఘనత టీడీపీదేనన్నారు. రైతుల రుణమాఫీ, పసుపుకుంకుమ, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఆదరణ తదితర పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పట్ల నమ్మకం ప్రజల్లో పెరిగిందన్నారు. జగన్, కేసీఆర్, మోదీల కుయుక్తులను తిప్పికొట్టాలని, వారు చేసే పనులను, రాజకీయాలను కంట కనిపెట్టాలన్నారు. పదవులు ఇవ్వడం వరకే తన వంతని, సమర్థత నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. ప్రజలతో మమేకం అయినప్పుడే ఫలితాలు అమోఘంగా ఉంటాయన్నారు.