ఆంధ్రప్రదేశ్‌

కేసీఆర్ దూతగా ఏపీకి వస్తున్నావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూతగా ఏపీలో రాజకీయాలు చేద్దామనుకుంటే టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఇక్కడి ప్రజలు క్షమించరని గాజవాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తలసాని తరచూ రాష్ట్రానికి వచ్చి టీడీపీపై విమర్శలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో, కేసీఆర్ ప్రోద్బలంతోనే తలసాని రాష్ట్రానికి తరచూ వస్తూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. యాదవ సామాజిక వర్గం తనవైపే ఉన్నట్టు తలసాని భావిస్తే అది పూర్తిగా భ్రమేనని, రాష్ట్రంలో యాదవులు టీడీపీకే అండగా ఉంటారన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీయేనని, యాదవులకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వసనీయత ఉందన్నారు.
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్టీ ఫిరాయించడంపై ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వ్యక్తిగత స్వార్ధంతో వైసీపీలో చేరిన అవంతి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పలు పార్టీలు మారి టీడీపీలో చేరిన అవంతికి అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇచ్చారని, దాదాపు ఐదేళ్ల పాటు పదవి అనుభవించి, ఇప్పుడు పార్టీ మారుతూ టీడీపీని లక్ష్యం చేసుకోవడం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. అవంతి తీరును ప్రజలు గమనిస్తున్నారని, తప్పనిసరిగా ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.