ఆంధ్రప్రదేశ్‌

పార్టీ మారినపుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: ఎన్నికల సమయంలో పార్టీల మారడం సహజమని, అయితే పార్టీ మారే సమయంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు చేసిన మేళ్ళను వివరిస్తూ ఆయన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన చెయ్యి ఆరకుండానే ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంల శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అవంతి పార్టీ మారడంపై విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి గంటా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీచేసే ప్రాథమిక హక్కు ఉందని, అయితే అయితే అవంతి శ్రీనివాస్ విషయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారేటపుడు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండాల్సిందన్నారు. టీడీపీలో ఐదు సంవత్సరాల పాటు ఎంపీగా ఉండి, ప్రతిపక్ష నేత జగన్‌ను ఎన్నో రకాలుగా విమర్శించిన అవంతి ఈ రోజు ఆకస్మికంగా అదే పార్టీలో చేరిపోవడాన్ని ప్రజలు హర్షించరన్నారు. పార్టీ మారే ముందు రోజు కూడా ఢిల్లీలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. జగన్ ఉగ్రవాది, రాజకీయాల నుంచి బహిష్కరించాలని గతంలో అవంతి ఇచ్చిన పత్రికా ప్రకటనల క్లిప్పింగులను మంత్రి గంటా ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబునాయుడు కాపులకు చాలా మేలు చేశారని క్షీరాభిషేకం చేసి, టీడీపీలో కదనోత్సాహం వెల్లివిరుస్తోందని ప్రకటనలు అవంతి శ్రీనివాసరావు చేశారని మంత్రి గంటా గుర్తుచేశారు. తాను కూడా ఒకపుడు ప్రజారాజ్యంలోకి వెళ్ళాలని, అయితే అప్పట్లో ప్రజలకు క్షమాపణ చెప్పానని, వెళ్ళేటపుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పల్లెత్తు మాట కూడా అనలేదని, వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. తాను చంద్రబాబునాయుడు పెంచిన మొక్క అని, రాజకీయంగా జన్మనిచ్చింది చంద్రబాబునాయుడు అని, జిల్లా రాజకీయ సమీకరణాల వల్ల పార్టీ మారినట్టు ప్రకటించానని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్ళిన తర్వాత మంత్రిగా ఉండగా కూడా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబునాయుడు తనకు పొలిటికల్‌గా రోల్‌మోడల్, ఆయనే తన మెంటార్ అని చెప్పానని మంత్రి గంటా గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలంతా ఆనందపడుతున్నారని, అన్ని వర్గాల ప్రజల అభీష్టం నెరవేరుతున్న తరుణంలో కులం గురించి మాట్లాడ్డం సరికాదన్నారు. రాజకీయాల్లో కొంచెమైనా నైతిక విలువలు పాటించాలని మంత్రి గంటా హితవు పలికారు.