ఆంధ్రప్రదేశ్‌

ఉగ్ర దాడిపై వెల్లువెత్తిన నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల మారణకాండపై విజయవాడ నగరంలో శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. దిష్టిబొమ్మల దగ్ధం, కొవ్వొత్తుల ర్యాలీలతో పలు సంస్థలు నిరసనలు వ్యక్తం చేశాయి. కులమత, వర్గ రాజకీయాలకతీతంగా వేలాది మంది నిరసనలు తెలిపారు. ఖబడ్డార్ పాకిస్తాన్, భారత్ మాతాకీ జై, వందేమాతరం, జోహర్ అమరవీరులు అన్న నినాదాలు దద్దరిల్లాయి.
సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఉగ్రవాది దిష్టిబొమ్మను తగులబెట్టారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో నిరసన పదర్శన అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఏపీయుడబ్ల్యుజే ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ వద్ద జర్నలిస్టులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అమరవీరుల ఆత్మశాంతికై రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ ఎదుట కొవ్వొత్తులతో జరిగిన నివాళి కార్యక్రమంలో ఎన్‌జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ జర్నలిస్టుల సంఘాల నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలు ఏలూరురోడ్డులో నిరసన ర్యాలీ అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సెంటర్‌లో మానవహారంగా నిలిచి నినాదాలు చేశారు. వందలాది ముస్లింలు మృతవీరులకు ఆత్మశాంతికై వివిధ మసీదుల్లో ప్రార్థనలు చేశారు.
ఉగ్రదాడి అమానుషం : రఘువీరా
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడి అమానుషమని, పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీర సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ముష్కరులు సాగించిన మారణకాండలో అమరులైన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.