ఆంధ్రప్రదేశ్‌

అణు విద్యుత్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 23: నెల్లూరు జిల్లాలో నెలకొల్పనున్న అణు విద్యుత్ కర్మాగారం ప్రతిపాదనల్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరులో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు ఎనిమిది వేల మెగావాట్లు సరిపోతాయని, ఇప్పటికే ప్రభుత్వం 30 వేల మెగావాట్లకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. అదనంగా మరో ఏడు వేల ఐదు వందల మెగావాట్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, ఇన్ని వేల మెగావాట్ల అణు విద్యుత్ ఏ దేశ ప్రయోజనాల కోసమో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని కావలి సమీపంలో నిర్మించ తలపెట్టిన ఈ అణు విద్యుత్ ప్లాంటుతో రుద్రకోట, చేవూరు, గ్రామాలతో పాటు సమీపంలోని మరో 9 గ్రామాలు, 9 మత్స్యకార ఆవాసాలు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. అణువిద్యుత్ ప్రతిపాదనల్ని ప్రభుత్వం బహిరంగపరచాలన్నారు. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను ఆపివేశారన్నారు. ఆయా దేశాలలోని అణు రియాక్టర్‌లను వారు అమ్ముకోవడం కోసం మన దేశంతో ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అణు విద్యుత్ కేంద్రాలలో భయానక రసాయన వ్యర్ధపర్ధార్ధాలు ఉంటాయన్నారు. ఇతర దేశాల ప్రయోజనాల కోసం దేశ, రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం సరికాదన్నారు. అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా మేధావులు, పౌర సమాజం పెద్దఎత్తున ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు.