ఆంధ్రప్రదేశ్‌

ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 15 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండానే ఒంటరిగానే పోటీ చేస్తామని పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెద్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన చిత్తూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తరపున జిల్లాలోని మూడు పార్లమెంట్, 14 శాసనసభ స్థానాల టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో కన్నా, ప్రస్తుతం పార్టీ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ నేపధ్యంలో రానున్న రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలు, 175 శాసనసభ స్థానాలకూ పోటీ చేయాలని పార్టీ అదిష్టానం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే ఆయా స్థానాలకు సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ స్థానాలకు 20 దరఖాస్తులుతో పాటు, 14 శాసనసభ స్థానాలకు 103 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరికి గత నాలుగు రోజులుగా శక్తికార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. అదే క్రమంలో ఒక్కో అభ్యర్థికి ఒక మండలాన్ని కేటాయించి, ఆ మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణి, కేటాయించిన మండలాల్లో మినీ సభల నిర్వహణ తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ నెల 19 వ తేది నుంచి వచ్చే నెల 3 వ తేది వరకు నిర్వహించనున్న ప్రత్యేకహోదా సాధన భరోసా యాత్ర ఉంటుందన్నారు. 13 జిల్లాలోని పలు పార్లమెంట్, శాసనసభ స్థానాల మీదుగా మొత్తం 2270 కిలో మీటర్ల మేర భరోసాయాత్రను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.