ఆంధ్రప్రదేశ్‌

బీసీల ఆత్మబంధువు చంద్రబాబుతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: బీసీల అభివృద్ధికి దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న బీసీల ఆత్మబంధువు చంద్రబాబు నాయుడితోనే అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ అన్నారు.
శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన నాటి నుండి నేటివరకు బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ సహా అనేక కీలక పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఒకేసారి 25 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటికి చైర్మన్లను నియమించారని గుర్తుచేశారు. బీసీలను చైతన్యవంతులను చేసేందుకు త్వరలో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఆదరణ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం కావాలో సలహాలు, సూచనలు స్వీకరించి మరింతగా చేయూత అందించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఏలూరులో వైసీపీ నిర్వహిస్తున్న నకిలీ బీసీ గర్జనకు రాష్ట్రంలోని బీసీలెవ్వరూ హాజరుకారని, బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారన్నారు. పొరుగు రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే నాయకులకు ప్రజలే బుద్ధిచెప్తారని స్పష్టంచేశారు.
అలాగే దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న నరేంద్రమోదీని సాగనంపేందుకు రాజకీయ శక్తులను కూడగడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో 13 జిల్లాలకు చెందిన బీసీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం జమ్మూ ఘటనలో మృతిచెందిన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

ఏపీలో కుల రాజకీయాలు చెల్లవ్

గుంటూరు, ఫిబ్రవరి 15: తెలంగాణ మాదిరి ఏపీలో కుల రాజకీయాలు చేయాలనుకుంటే చెల్లవని, తెలుగుదేశం ప్రభుత్వం కులాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సాదినేని యామినీ శర్మ, పంచుమర్తి అనూరాధ పేర్కొన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వేర్వేరుగా నిర్వహించిన విలేఖర్ల సమావేశాల్లో వారు మాట్లాడారు. తెలంగాణాలో పలు కులాలను బీసీ జాబితా నుండి తొలగించినప్పుడు నోరు మెదపని టీఆర్‌ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి బీసీలను ఉద్దరిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సంక్రాంతికి రాష్ట్రప్రభుత్వం డ్వాక్రా మహిళకు అందజేసిన పసుపు కుంకుమ చెక్కులతో మహిళలందరూ ఆనందంగా ఉన్న సమయంలోనూ టీఆర్‌ఎస్ నాయకులు వచ్చి కుల రాజకీయాలకు తెరలేపారన్నారు. ప్రస్తుతం రైతులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతా సుఖీభవ పథకం అమలు చేస్తుంటే మరో మారు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా తెలుగుదేశం చేసిన సంక్షేమంలో కొట్టుకుపోవడం ఖాయమనీ, అభివృద్ధి చేసే చంద్రబాబుకే ఏపీ ప్రజలు పట్టంకడతారని ఆమె పేర్కొన్నారు. స్వార్థం కోసం పార్టీ మారిన వారికి టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. అవంతి శ్రీనివాస్‌కు ఎంపీగా కన్నా వలసపక్షిగానే ఎక్కువ గుర్తింపు ఉందని ఎద్దేవాచేశారు.
తెలుగుదేశం పార్టీని వీడి అసత్య ఆరోపణలు చేస్తున్న అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌లకు ప్రజలే తగిన బుద్ధిచెప్తారన్నారు. ప్రజాదరణ కొరవడి ఓటమిభయంతో పార్టీమారిన వీరి వ్యాఖ్యలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించిన యామినీ శర్మ, అనూరాధలు, అమరుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున సానుభూతి తెలియజేశారు.