ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను రాష్ట్ర శాసన మండలి ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణకు శుక్రవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసన సభకు పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ఇంకా రెండేళ్ల ఒక నెల ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే పదవి కోరుకోవడం సరికాదనిపించిందని, దీంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వేరే వారికి అవకాశం ఇవ్వచ్చని, ముందుగా రాజీనామా చేశానన్నారు. తన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెబితే ఆలోచించావా.. అని అడిగారన్నారు. వెంటనే రాజీనామా అమోదం పొందేలా చూడాలని కోరానన్నారు. నిన్నటి వరకూ క్షీరాభిషేకం, నేడు తిట్లాభిషేకం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. రాజీనామా చేస్తుండటం సంతోషంగా ఉందని, సర్వేపల్లి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. అందుకే రాజీనామా చేశానని తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వారి సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామా చేయడం తెలిసిందే.