ఆంధ్రప్రదేశ్‌

డీఎస్సీ 2018 ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: డీఎస్సీ-208 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విడుదలచేశారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి, విద్యా శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఫలితాల పాస్‌వర్డు లింక్‌ను ల్యాప్‌టాప్‌లో మంత్రి విడుదల చేశారు. డీఎస్సీ నిర్వహించే తేదీని రాజమహేంద్రవరంలోనే వెల్లడించామని, ఫలితాలు కూడా అనుకున్న సమయానికి ఇక్కడే విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులందరికీ మే 15న జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామన్నారు. అభ్యర్థులందరితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే 30న ప్రతిజ్ఞ చేయిస్తారన్నారు. అనంతరం జూన్ ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు శిక్షణనిస్తామన్నారు. 12వ తేదీన స్కూలు తెరిచే రోజున వారంతా విధుల్లో చేరతారన్నారు. కేవలం 110 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించడం ఒక రికార్డన్నారు. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం కూడా రికార్డేనని మంత్రి పేర్కొన్నారు. నిర్ధేశిత గడువు ప్రకారం అకడమిక్ ఇయర్ షెడ్యూలును ప్రకటించి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించడంవల్ల ప్రభుత్వంపై మరింత విశ్వసనీయత పెరిగిందన్నారు. 2018 డి ఎస్సీకి సంబంధించి గత ఏడాది అక్టోబర్ 26న మొత్తం 7902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తే వివిధ కేటగిరీల కింద 6241 పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు. స్కూలు ఎడ్యుకేషన్‌కు సంబంధించి 4514, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 1100 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో ఏజెన్సీలో 500 పోస్టులు, మైదాన ప్రాంతంలో 300 పోస్టులు మొత్తం 6241 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా ఏపీ మోడల్ స్కూల్సుకు సంబంధించి 909 పోస్టులు ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో 175 పోస్టులు, ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 404 పోస్టులు వెరసి 7902 పోస్టుల్లో స్కూళ్ళు తెరిచే సమయానికి అంటే జూన్ 12వ తేదీన అందరూ విధుల్లో చేరతారన్నారు.
మొత్తం 6లక్షల 8వేల 155 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 5 లక్షల 89 వేల 165 మందికి హాల్ టిక్కెట్లు వచ్చాయని, పరీక్షలకు 5 లక్షల 5వేల 547 మంది హాజరయ్యారన్నారు. ఈ పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్ పిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు శారీరక సామర్ధ్య పరీక్ష జనవరి 4 నుంచి 13 వరకు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా మ్యూజిక్, డ్రాయింగ్, క్రాఫ్ట్స్ తదితర పోస్టులకు కూడా డీఎస్సీలో పరీక్షలు నిర్వహించి, భర్తీ చేస్తున్నామన్నారు. స్కిల్ టెస్ట్ జనవరి 6 నుంచి 12 వరకు మ్యూజిక్ టీచర్లకు విజయవాడలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజిలో నిర్వహిస్తామన్నారు. మొత్తం 52 సబ్జెక్టుల్లో 101 సెట్ల పరీక్ష పేపర్లు ఇచ్చామన్నారు. 25,720 ప్రశ్నలతో పరీక్షా పత్రాలు రూపొందించామని, 8844 అభ్యంతరాలను కూడా స్వీకరించి నివృత్తిచేశామన్నారు. అభ్యంతరాలపై కమిటీ వేసి పరిష్కరించామని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టాపర్లు వీరే...
ఎస్‌ఏ మేథ్స్‌లో పుణ్యవతి సాహు
ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్‌లో
కనకరాజు అనిశెట్టి
ఎస్‌ఏ బయలాజికల్ సైన్స్‌లో
పీవీ సుధీర్‌కుమార్
ఎస్‌ఏ సోషల్ స్టడీస్‌లో
టాఫర్ నీలం మణికంఠ

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: డీఎస్సీ 2018 పరీక్షా ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన వారి వివరాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. మొత్తం 52 కేటగిరీల్లో టాపర్స్ వివరాలను వెల్లడించారు. స్కూలు అసిస్టెంట్స్ (ఎస్‌ఏ) మేథమెటిక్స్ తెలుగు మీడియంలో 81.20 మార్కులు సాధించిన విశాఖపట్నానికి చెందిన పుణ్యవతి సాహూ టాపర్‌గా నిలిచారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌లో తెలుగు మీడియంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కనకరాజు అనిశెట్టి 79.37 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. స్కూలు అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన పాణ్యం వెంకట సుధీర్‌కుమార్ 83.73 మార్కులతో, సోషల్ సైన్స్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నీలం మణింకఠ 90.00 మార్కులతో టాపర్లుగా నిలిచారు. స్కూలు అసిస్టెంట్ సంస్కతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్ల పోసియ్య 90.67 మార్కులతో, లాంగ్వేజ్ పండిట్ల విభాగంలో సంస్కృతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఫణిశ్రీ వాజిపేయాజులు టాపర్లుగా నిలిచారు.
తెలుగు మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్స్‌లో విజయనగరానికి చెందిన వేమన కుసుమ 91.07 మార్కులతో టాఫర్‌గా నిలిచారు. తెలుగు మీడియం మేథమెటిక్స్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరావు సేనాపతి, ఫిజికల్ సైన్స్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాయపాటి సరోజ టాఫర్లుగా నిలిచారు. భాషా పండిట్లలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తానాల అశోక్ కుమార్ టాపర్‌గా నిలిచారు. పీజీ టీచర్స్‌లో కడపకు చెందిన కరిది బాలాజీ (తెలుగు), పీజీ టీచర్స్ హిందీలో శ్రీకాకుళానికి చెందిన దాసరి హేమంతు, ఇంగ్లీషు మీడియంలో విశాఖకు చెందిన శేఖర్ పెతకంశెట్టి, మేథమెటిక్స్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తిక్కిరెడ్డి విజయలక్ష్మి, బోటనీలో కడపకు చెందిన షేక్ నూర్‌అహ్మద్, కెమిస్ట్రీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్, కామర్స్‌లో గుంటూరుకు చెందిన శివనాగేశ్వరరావు సంధు, ఎకనామిక్స్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్ గోపాల్, బయోలాజికల్ సైన్స్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన జూతూరి సుబ్బారావు, సోషల్ స్టడీస్‌లో అనంతపురానికి చెందిన హులియప్ప శారద అన్నపూర్ణ, ఫిజిక్స్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భోగరాజు, జువాలజీలో కడప జిల్లాకు చెందిన షేక్ నూర్ అహ్మద్, సివిక్స్‌లో అనంతపురానికి చెందిన ఎస్ నబీ రసూల్ టాపర్లుగా నిలిచారు. అలాగే కన్నడ, సంస్కృతం, తెలుగు, ఉర్ధూ, తమిళం, ఒరియాలకు సంబంధించి స్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌లకు సంబంధించి మొత్తం 59 మంది టాపర్లుగా నిలిచారు.