ఆంధ్రప్రదేశ్‌

వైకాపాలోకి టీడీపీ ప్రముఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ పోలీస్ బాస్‌లతో పాటు పారిశ్రామిక వేత్తలు వైఎస్సాఆర్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. శుక్రవారం వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం లోటస్‌పాండ్‌లో విజయా ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ జగన్‌తో బేటీ అయ్యారు. ఈయన వెంట ప్రకాశంకు జిల్లాకు చెందిన దగ్గుపాటి వెంకటేశ్వరావు, మాజీ అడసుమల్లి జయప్రకాశ్ ఉన్నారు. దాసరి జై రమేష్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా జై రమేష్ ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా దాసరి జై రమేష్ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో వైఎస్సాఆర్‌లో చేరుతున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే సాంబశివరావుతో చర్చలు జరిగాయని, రేపోమాపో ఆయన జగన్‌తో భేటీ అవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. కాగా జగన్ కలసిన అనంతరం దాసరి జై రమేష్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట ఇస్తే దానిమీద నిలబడతారని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీ నూటికి నూరుపాళ్ళు విజయం సాధించడం తథ్యమన్నారు. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ పార్టీలో చేరతానని చెప్పారు. తానుపోటీ చేసినా చేయకపోయిన పార్టీలో చేరడం ఖాయమని నొక్కి చెప్పారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటానని వెల్లడించారు. జగన్‌తో కలసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.