ఆంధ్రప్రదేశ్‌

గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 878 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 88 హాస్టల్స్, 151 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, 1760 గిరిజన ప్రాథమిక పాఠశాలలు మొత్తం 2822 విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసారు. ఈ ఖాళీల్లోకి గిరిజన నిరుద్యోగులను తీసుకోవాలని, 2018లో మంజూరైన 1496 టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు గిరిజన స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. ఫలితంగా అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన విద్యాభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారిందని అన్నారు.