ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రాజా తెలిపారు. 175 ఎమ్మెల్యే స్థానాలకు 1161 దరఖాస్తులు, 25 లోక్‌సభ స్థానాలకు 199 దరఖాస్తులు వచ్చాయని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి 9, మచిలీపట్నం స్థానానికి 9, కృష్ణాజిల్లా అసెంబ్లీ స్థానాలకు 112, శ్రీకాకుళం జిల్లా లోక్‌సభకు 3, అసెంబ్లీలకు 43, విజయనగరం జిల్లాలో లోక్‌సభకు 1, అసెంబ్లీలకు 56, విశాఖజిల్లాలో లోక్‌సభకు 18, అసెంబ్లీలకు 92, తూర్పుగోదావరి జిల్లాలో లోక్‌సభకు 21, అసెంబ్లీలకు 127, పశ్చిమ గోదావరి జిల్లాలో లోక్‌సభకు 7, అసెంబ్లీలకు 88, గుంటూరు జిల్లాలో లోక్‌సభకు 22, అసెంబ్లీలకు 157, ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్‌కు 6, అసెంబ్లీలకు 72, నెల్లూరు జిల్లాలో లోక్‌సభకు 13, అసెంబ్లీలకు 66, కర్నూలు జిల్లాలో లోక్‌సభకు 13, అసెంబ్లీలకు 84, కడప జిల్లాలో లోక్‌సభకు 22, అసెంబ్లీలకు 92, అనంతపురం జిల్లాలో లోక్‌సభకు 29, అసెంబ్లీలకు 82, చిత్తూరు జిల్లాలో లోక్‌సభకు 26, అసెంబ్లీలకు 90 దరఖాస్తులు వచ్చాయని ఎస్‌ఎన్ రాజా తెలిపారు.