ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా మరో 15 గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కొత్తగా మరో 15 సాంఘిక సంక్షేమ శాఖ గురుకులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఒక్కో పాఠశాలను 33.5 కోట్ల రూపాయలతో నిర్మించనుంది. త్వరలో వీటికి నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టనుంది. వీటి ద్వారా మరో 14,200 మందికి ప్రవేశం లభిస్తుంది. కొత్త గురుకులాల కోసం 502 కోట్ల రూపాయలను కేటాయించింది. మరో 60 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేసింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులతో శనివారం నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే గురుకులాల లక్ష్యమన్నారు. అట్టడగు వర్గాల పిల్లందరికీ నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాడు ఎన్టీఆర్ గురుకుల విద్యాలయాలకు శ్రీకారం చుట్టారన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇస్తే ఎంతవరకైనా ఎదుగుతారన్నారు. కొటబొమ్మాళి, నరసాయపాలెం, నరసారావుపేట, వేమూరు, పెద్దాపురం, పసివేదుల, గోపాలపురం, వెల్లటూరు, కోవెలంపాడు, గొట్టిప్రోలు, కెకె గుంట, పాలమండ, ప్రత్తికొండ, బనగానపల్లె, చోమండేపల్లిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యాలయంలో పూర్తిస్థాయిలో ఇంగ్లీషు మీడియం, డిజిటల్, వర్చువల్ తరగతులను ప్రవేశపెడుతున్నామన్నారు. పదోతరగతిలో 100 శాతం ఉత్తీర్ణత ఈ ఏడాది లక్ష్యమన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా గురుకులాల్లో కార్పొరేట్ సంస్థలను మించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, పుట్టుక మన చేతిలో లేదని, కానీ భవిత మన చేతిలో ఉందన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఆంగ్లభాషలో మాట్లాడి సభికులను మంత్రముగ్ధులను చేసిన బాలికను అభినందించారు. భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. చదువు సంస్కారాన్ని ఇస్తుందని, జ్ఞానాన్ని ఇస్తుందని, ర్యాంకుల కోసం కాదన్నారు. చదువుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుందని, రాష్ట్రంలో లక్షల మంది పేదపిల్లలు ఉన్నా, గురుకులాల్లో చదువుకునే అవకాశం కొంతమందికే దక్కిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, వయాడక్ట్ గురించి వివరించారు. పిల్లలు చదువుకుని ప్రయోజకులైతే తల్లితండ్రులకు ఆనందమని, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలని కోరారు. జపాన్ నుంచి ఎవరైనా వస్తే తనకు అనువాదం చేయాలని జపాన్ భాష నేర్చుకున్న పిల్లలకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు.