ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్ కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 16: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పేలా అమరావతి రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహంతో పాటు, స్మృతివనాన్ని రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 168 కోట్ల రూపాయలతో చేపట్టామని, జూన్ మాసాంతానికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం శాఖమూరులో చేపట్టిన అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్‌ఎస్ రావత్‌తో కలిసి పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని 125 అడుగుల విగ్రహం, 20 ఎకరాల్లో స్మృతివనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఫౌండేషన్ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టును సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుండగా, కెపిసి సంస్థ నిర్మాణ పనులను చేపట్టినట్లు వివరించారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనంకు తోడుగా అంబేద్కర్ రచనలకు సంబంధించిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనందబాబు వెంట రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మద్దిరాల జోసఫ్ ఇమ్మానియేల్ (మ్యాని), సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.