ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిధులతోనే ఆంధ్రాలో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 17: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతోందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జ్ దగ్గుబాటి పురంద్రీశ్వరి అన్నారు. ఆదివారం నెల్లూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పురంద్రీశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీపై చేస్తున్న విమర్శలు దారుణమన్నారు. అయితే గుంటూరులో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమిచేసింది.. ఏమి చేస్తోంది మాత్రమే చెప్పారన్నారు. ఢిల్లీలో దీక్ష చేసేందుకు ఎవరూ రాకపోతే కొంతమంది నాయకులకు డబ్బులిచ్చి రైళ్ల ద్వారా జనాలను తరలించి చంద్రబాబు దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం నిధులిస్తున్న పథకాలకు పేర్లు మార్చుకుని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేకించి ప్రజలకు చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని, ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నారని, ఆయన ఏదైనా చేస్తున్నారంటే అది తనయుడుకి దోచిపెట్టడమేనని ఆమె ధ్వజమెత్తారు.