ఆంధ్రప్రదేశ్‌

స్వయం సహాయక బృందాలకు స్మార్ట్ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల మహిళలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-ప్రగతి, మీ-సేవ, యువనేస్తం, రియల్ టైమ్ గవర్నెన్స్, తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు స్వయం సహాయక బృందాల మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉన్న స్మార్ట్ఫోన్లను ఎంపిక చేసేందుకు సాంకేతిక కమిటీని నియమించింది. దీనికి చైర్మన్‌గా ఆర్టీజీఎస్ సీఈవో, సభ్యులుగా ఆర్టీజీఎస్ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణప్రసాద్, ఈ-ప్రగతి సీఈవో, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సీఈవో, ఏపీ ఫైబర్నెట్ సీఈవో, సెర్ప్ సీఈవో, ఐటీ విభాగం ప్రతినిధి, కన్వీనర్‌గా ఏపీటీఎస్ ఎండీ వ్యవహరిస్తారు.
కొనుగోలుకు సంబంధించి మరో కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఫౌరసరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్‌గా, సభ్యులుగా పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కన్వీనర్‌గా ఏటీటీఎస్ ఎండీ వ్యవహరిస్తారు. ఏపీటీఎస్ ఈ ప్రక్రియ మొత్తానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.