ఆంధ్రప్రదేశ్‌

జగన్ కొంగజపాన్ని బీసీలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: వైకాపా అధినేత జగన్ చేస్తున్న కొంగజపాన్ని బీసీలు నమ్మరని, పదవీకాంక్షతో హామీలు గుప్పిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ విజయవంతం అయిందనే అక్కసుతో ఇప్పుడు బీసీ గర్జన నిర్వహిస్తూ జగన్ కపటప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. జయహో బీసీ సదస్సులో తామిచ్చిన హామీలు, నినాదాలను కాపీకొట్టారే తప్ప, జగన్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఆరోపించారు. టీడీపీ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే తాను హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగానని జస్టిస్ రోహిణి చెప్పిన మాటలను ప్రజలు మరచిపోలేదని తెలిపారు. బీసీలు రాజ్యాంగపరమైన పదవులు పొందకుండా టీడీపీ అడ్డుకుందని జగన్ చెప్పడం అబద్ధమని ఖండించారు. 2004-09 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన అకృత్యాలను బీసీలు మరిచిపోలేదని గుర్తుచేశారు. 113 సెజ్‌ల పేరుతో బీసీల భూములను లాక్కుంది జగన్ బినామీలేనని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు చెందిన 5లక్షల ఎకరాల భూములను లాక్కున్న చరిత్ర వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఆరోపించారు. వాన్‌పిక్ పేరుతో 28వేల ఎకరాలు, లేపాక్షి సెజ్ పేరుతో 8808 ఎకరాలు, బ్రాహ్మణి స్టీల్ పేరుతో 10వేల ఎకరాలు జగన్ బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. బీసీలను ఫ్యాక్షనిజానికి బలిచేసింది రాజారెడ్డి కుటుంబమని ఆరోపించారు. ఆస్తులు, తోటలు, పంటలు నాశనం చేసి, బీసీలపై అకృత్యాలకు పాల్పడింది వాళ్లేనని ధ్వజమెత్తారు. బీసీలు నిలదొక్కుకుంటే తిరగబడతారన్న భయంతోనే ఫ్యాక్షన్ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపారని ఆరోపించారు. తండ్రి అధికారంలో ఉండగా, ఎంపీగా ఉండగా బీసీల గురించి జగన్ నోరు తెరవలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 35ఏళ్లలో బీసీలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన మొదటి 35ఏళ్లలో అందలేదని గుర్తుచేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై రెండుసార్లు కేంద్రానికి తీర్మానం పంపామని తెలిపారు. ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. మండల్ కమిషన్ సిఫారుసులను అమలు చేసింది టీడీపీయేనని, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల్లో వారికి వాటా కల్పించిందని తెలిపారు. ఈ ఐదేళ్లలో 43వేల కోట్ల రూపాయలను బీసీలకు ఖర్చు చేశామని, బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా తొలిసారిగా తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించామన్నారు. బీజేపీ, కేసీఆర్, వైకాపా కలిసి కుట్రల కూటమిగా మారాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీకి హాజరుకాని వారికి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కుట్రల కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆదివారం హెచ్చరించారు.
అది ఎన్నికల స్టంట్
ఆచంట: ఇప్పటివరకు బలహీన వర్గాలను ఏమాత్రం పట్టించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల సభ పెట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని రాష్టక్రార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పితాని మాట్లాడారు. ఏలూరులో బీసీ గర్జన సభలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కోసం తప్ప ఎప్పుడైనా జగన్ బీసీల కోసం సమావేశాలు పెట్టారా అని ప్రశ్నించారు. విద్యార్ధుల ఫీజు రియింబర్స్‌మెంట్‌కు వేలాదికోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని, అయినా జగన్ ఏమీ ఖర్చుపెట్టడడం లేదని అనడం దారుణమన్నారు. ఎప్పటినుంచో బీసీలకు సబ్‌ప్లాన్ చట్టం కావాలని అడుగుతున్నామని, అయితే రాష్ట్రంలో బీసీ నాయకుడిగా రాజమండ్రిలో జరిగిన జయహో సభలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం అంగీకరించి శాసనసభలో చట్టంచేసిందని గుర్తుచేశారు. చట్టంద్వారా క్యాబినెట్‌లో ఆమోదించి చట్టాన్ని అమలు చేస్తున్నామని, దీంతో బీసీలపై తెలుగుదేశంకు ఎంతప్రేమ ఉందో అర్ధమవుతుందన్నారు. బలహీనవర్గాలకు సంబంధించి వస్తున్న అనేక అభ్యర్ధనలు దృష్టిలో ఉంచుకుని వృత్తిపరమైన కులాలతో 21 కార్పొరేషన్లు తెచ్చామని తెలిపారు. బీసీలకు సంబంధించి 119 హామీలు ఇచ్చామని, వీటిలో చాలావరకు అమలుచేశామని, కొన్ని చట్టపరంగా ఇబ్బందులు తలెత్తడడంతో కేంద్రానికి పంపించామని మంత్రి పితాని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఢిల్లీలో సైతం రోడ్డెక్కి పోరాటాలు చేస్తే, జగన్‌గాని, పార్టీనాయకులు గాని ఏమాత్రం స్పందించలేదన్నారు. కనీసం 13 జిల్లాలో వైసీపీ బీసీ అధ్యక్షుల్ని చేసిందా అని ప్రశ్నించారు. బీసీలపై కపట ప్రేమ కనబరుస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వాలంటే వారికి డబ్బులు లేవని సీట్లు ఇవ్వడం లేదన్నారు. బీసీలు పోటీ చేయడానికి అర్హులు లేరని చెప్పడం సిగ్గుచేటన్నారు.