ఆంధ్రప్రదేశ్‌

ఖర్చు 1.18 లక్షల కోట్లు.. పెరగని ఆయకట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులకు గత నాలుగున్నరేళ్లుగా సుమారు రూ. లక్షా 18వేల కోట్లు ఖర్చుచేసినా నికరంగా పంటల సాగు పెరగడానికి బదులు తగ్గుతోందని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో వీరు రాష్ట్ర వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయన నివేదిక విడుదల చేశారు. ఈసందర్భంగా కృష్ణంరాజు విలేఖరులతో మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఆహార పంటల విస్తీర్ణం క్రమంగా హరించుకుపోతోందన్నారు. 2014-15 సంవత్సరంతో పోల్చితే 2018-19 సంవత్సరానికి ఆహార ధాన్యాలు సాగుచేసే విస్తీర్ణం సుమారు 10శాతం తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనమిక్ సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 42లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా 35.46 లక్షల హెక్టార్లలోనే సాగు చేస్తున్నారని, గత నాలుగేళ్లలో ఇదే అత్యంత తక్కువగా నమోదైన సాగు విస్తీర్ణమని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి కూడా ఏటేటా తగ్గిపోతోందని, 2016-17 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి 78.50 లక్షల టన్నులు కాగా, 2017-18 ఖరీఫ్ సీజన్‌లో 76.45 లక్షల టన్నులకు తగ్గిపోయిందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులకు రూ. 58వేల కోట్లు, వ్యవసాయ రంగానికి నాలుగేళ్లగా రూ. 60వేల కోట్లకు పైగా రాష్ట్రంలో ఖర్చు చేశారని, కొత్తగా 12 చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. ఇంత చేస్తున్నా ఆయకట్టు తగ్గిపోవడానికి కారణాలను ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు.
ప్రసాదబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 676 మండలాలుంటే ప్రభుత్వమే అధికారికంగా 2018-19లో 257 కరవు పీడిత మండలాలని ప్రకటించిందన్నారు. కరవు కారణంగా ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. వ్యవసాయ రంగ నిపుణుడు పీజీకే మూర్తి మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ నదులకు లేనన్ని డ్యాములు, రిజర్వాయర్లను కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉప నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మించాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్‌లో జనవరి, ఏప్రిల్ నెలల్లో గోదావరి డెల్టాకు నీటి లభ్యత ఉండదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో ఎడిటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్, చేకూరి సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.