ఆంధ్రప్రదేశ్‌

అగ్రగామి ఆంధ్ర కాంగ్రెస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రైతురాజ్యం రావాలంటే, వ్యవసాయమే పండుగ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రంలోనూ రావాలని ఏపీసీసీ మీడియా సమన్వయ కమిటీ చైర్మన్ ఎస్ తులసీరెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం మీడియా సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను రైతులే గెలిపిస్తారని అన్నారు. అధికారంలోకి రాగానే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేస్తారన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, కనీస ఆదాయ భరోసా పథకం, ఉపాధి హామీ, వ్యవసాయానికి అనుబంధం, ఫసల్ బీమా యోజన, తదితర రైతు పథకాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి రూ. 12,500 రైతుకు ఇస్తామన్నారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర 13రోజుల పాటు 13 జిల్లాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 84 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 64 బహిరంగ సభలతో సాగుతుందని తెలిపారు. ఈ యాత్ర పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి నాయకత్వంలో సీనియర్ నేతలతో జరుగుతుందన్నారు. 13 రోజుల్లో రాహుల్, ప్రియాంక, జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటారన్నారు. ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నుంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుందన్నారు. ఈసందర్భంగా మీడియా కమిటీ భరోసా ప్రజాయాత్ర పోస్టర్‌ను, కరపత్రాన్ని విడుదల చేశారు. విలేఖరుల సమావేశంలో కమిటీ కోచైర్మన్ జంగా గౌతం, సంజీవరెడ్డి, నరహరశెట్టి నరసింహరావు, రామకృష్ణ, శక్తి కోఆర్డినేటర్ విజయ్, మద్ది శ్రీనివాస్, విజయ్ పాల్గొన్నారు.