ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శే్వతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే శే్వతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందని విమర్శించారు. విద్యుత్, సీఆర్‌డిఏ, ఇరిగేషన్, ఎపిఐఐసీ వంటి తొమ్మిది సంస్థలను బ్యాంకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టి 95 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఓట్లను కొనుగోలు చేసేందుకు వివిధ పథకాల పేరుతో ప్రజలకు సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. 1996 నుండి 2004 వరకు, 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పతనం అయ్యిందన్నారు. 2004 నుండి 2014 వరకు ఎలాంటి ఓడిలు లేకుండా ప్రభుత్వం సజావుగా నడిచిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ డ్రామా కంపెనీ అని, ముఖ్యమంత్రి గంటకో వేషం వేస్తున్నారని విమర్శించారు. పిల్ల కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తల్లి కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లేనని ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడే తీరు సరిగ్గా లేదన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబును నమ్మితే ప్రజలకు తిప్పలు తప్పవన్నారు. 2014వ సంవత్సరంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు పాకులాడుతున్నారని ఆరోపించారు. కడప స్టీల్‌ప్లాంట్, భోగాపురం ఎయిర్‌పోర్టు, కర్నూల్ ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపనలు చేయడం బూటకమేనన్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఉంటే ఇంతవరకు ఎందుకు వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈనెల 19వ తేదిన మచిలీపట్నం నుండి నెల్లూరు వరకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలు ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్యఅతిధిగా కేంద్ర, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా హాజరవుతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీశ్రేణులకు, కార్యకర్తలకు దిశా నిర్థేశం చేసేందుకు విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాయలసీమకు సంబంధించి రాజ్‌నాధ్‌సింగ్, ఉత్తరాంధ్రకు సంబంధించి అమిత్‌షా పాల్గొని సమావేశాలు నిర్వహించారన్నారు. ఈనెల 21వ తేదిన రాజమండ్రిలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశానికి జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈ విలేఖర్ల సమావేశంలో జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంద్రీశ్వరి, జిల్లా పార్టీ అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు సురేష్‌రెడ్డి, ఖలీఫ్‌తుల్లా బాషా, గోలి నాగేశ్వరరావు, దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.