ఆంధ్రప్రదేశ్‌

ఏపీఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర తన పదవికీ రాజీనామా చేశారు. దీనిని ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో పదవిలో కొనసాగలేనంటూ దొర రాజీనామా లేఖను అందివ్వగా, దీనిని ఆమోదించడంతో ప్రస్తుతం ఎస్‌పీడీఎస్‌ఎల్ సీఎండీ ఎంఎం నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా విద్యుత్ కండక్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనపై ఏపీ ట్రాన్స్‌కో (విజిలెన్స్) జేఎండీ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ పూర్తయ్యింది. దీంతో ప్రాథమిక చర్యల్లో భాగంగా రాజీనామా లేఖను ఆమోదించారు. ఇందుకు సంబంధించిన కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఈ సంఘటనకు సంబంధించి సోమవారం ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ (ఓపీ-ఏ3) డిపార్ట్‌మెంట్ నుంచి ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదలైంది. అయితే దీనిపై వివరణ కోరేందుకు ‘ఆంధ్రభూమి’ ప్రయత్నించగా దొర అందుబాటులో లేరు.